హైదరాబాద్ యువతిపై అమెరికాలో అత్యాచారం

హైదరాబాద్ కుటుంబానికి చెందిన యువతి అమెరికాలోని చికాగోలో అత్యాచారం చేసి హతమార్చాడు ఓ దుండగుడు. రూత్ జార్జ్ (19) అనే యువతి మాట్లాడేందుకు నిరాకరించడంతో డొనాల్డ్ తుర్మాన్ చంపేశాడు. పిలిస్తే పట్టించుకోలేదని, మాట్లాడేందుకు నిరాకరించడని కోపంతోనే గొంతు నులిమి హత్య చేశాడని ఒప్పుకున్నాడు. మంగళవారం తుర్మాన్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది.
కుక్ కౌంటీ ప్రాసిక్యూటర్ జేమ్స్ మర్ఫీ మాట్లాడుతూ.. నిందితుడు నేరం చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. శనివారం ఉదయం యూనివర్సిటీ క్యాంపస్ రూత్ జార్జ్ పార్కుకు నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో తుర్మన్ వెనుక నుంచి పిలిచాడు. పట్టించుకోకుండా కారు గ్యారేజీలోకి వెళ్తుండటం గమనించి ఆమెను వెంబడించాడు.
ఆగ్రహానికి గురై ఆమె గొంతు నులిమానని అచేతనా స్థితిలోకి వెళ్లిపోవడంతో ఆమెపై అత్యాచారం జరిపానని తుర్మాన్ ఒప్పుకున్నాడు. ఆమె చాలా అందంగా ఉందని, తనతో మాట్లాడాలని భావించానని వివరించాడు.
తుర్మన్‌కు బెయిల్ ఇవ్వొద్దని, కస్టడీలోకి తీసుకోవాలని వాదనలు విన్న జడ్జి చార్లెస్ బీచ్–2 ఉత్తర్వులు జారీచేశారు. ఆయుధాల దొంగతనం కేసులో ఆరేళ్లు జైలు శిక్షకు గురైన తుర్మన్ రెండేళ్లు జైలులో ఉండి గతేడాది డిసెంబర్‌లో బెయిల్‌పై బయటికి వచ్చాడు. రూత్‌జార్జ్ షికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో ఆనర్స్ రెండో సంవత్సరం చదువుకుంటోంది. హైదరాబాద్‌కు చెందిన ఆమె కుటుంబం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడింది.