వైసీపీ లీడర్లు కేసీఆర్ దగ్గర పాఠాలు నేర్చుకోవాలి: పవన్ కళ్యాణ్

  • Publish Date - November 10, 2019 / 07:53 AM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం నిర్ణయంపై ఇప్పటికే పలువురు విమర్శలు ఎక్కుపెట్టగా.. ఇప్పుడు ఇదే నిర్ణయంపై ట్విట్టర్ వేదికగా  జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా విమర్శలు ఎక్కుపెట్టారు.

తెలుగు మీడియంను వైసీపీ రద్దు చేస్తుంటే అధికార భాషా సంఘం ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. భాష, సంస్కృతిని ఎలా కాపాడుకోవాలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి వైసీపీ లీడర్లు నేర్చుకోవాలని అన్నారు.

కేసిఆర్ తెలుగు భాషను కాపాడడం కోసం కృషి చేస్తున్నట్లుగా ఈ సంధర్భంగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 2017లో జరిగిన తెలుగు మహా సభలను గురించి కూడా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంను రద్దు చేస్తే మన భాష, సంస్కృతి మరుగున పడిపోతాయని పవన్‌ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.