బజాజ్ పల్సర్ ఇంజిన్‌తో ఇండియన్ ప్రయోగం.. సక్సెస్‌ఫుల్‌గా గాలిలో, రోడ్‌పై, నీటిపై ప్రయాణం

Bajaj Pulsar: రెండు చక్రాల వాహనాన్ని బైక్ అన్నట్లు.. మూడు చక్రాలతో నడిచేవాటిని ట్రైక్ అంటారు. రెగ్యూలర్ మోటర్ సైకిల్ ను.. స్కూటర్ గా మార్చిన సందర్భాల్లో మనం ఈ ట్రైక్స్ ను చూశాం. ఇది చాలా వరకూ బైక్ కు దగ్గరగానే ఉంటుంది. కేరళలోని వ్యక్తి కొత్త ప్రయోగంలో ట్రైక్ తయారు చేసి రోడ్‌పైనా, నీటిపైనా, గాలిలో షికార్ చేసేస్తున్నాడు.
ఆనంద్ హెలిక్స్ కళ్యాణి అనే యూట్యూబ్ ఛానెల్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తుంది. 2018 నుంచి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ రీసెంట్ గా సక్సెస్ చేశాడు. దీని ప్రత్యేకతలేంటంటే.. గాలిలో, నీటిలో, రోడ్డు మీద ప్రయాణించగలగడం.
బజాజ్ పల్సర్ ఇంజిన్ తో రెడీ చేసిన ఈ వాహనం.. నీటిలో ఎయిర్ బోట్ లాగా ప్రయాణిస్తుంది. గాలిని వెనక్కు తోసి బోటును ముందుకు పంపే మెకానిజాన్నే దీనికి వాడారు. దాని కోసం బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఇంజిన్ ను వాడారు.
ఆ ఇంజిన్ ను ఓ చెక్కకు అమర్చి ప్రొటెక్ట్ చేశారు. నార్మల్ ప్లాస్టిక్ తో ఫ్యూయెల్ ట్యాంక్ ఏర్పాటు చేసి రెండు సీట్లు సెట్ చేశారు. చాలా స్మూత్ గా ప్రయాణిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. నీటిపైనే ప్రయాణిస్తుంది.. లోపలికి వెళ్లడం లేదు కాబట్టి ప్రమాదమేమీ ఉండదు.
పైగా దీనిని కంట్రోల్ చేసేది కూడా కాలి పెడల్ తోనే. యాక్సిలేటర్, బ్రేక్ పెడల్స్ సెట్ చేశారు. ఏదైనా ఎమర్జెన్సీ బ్రేక్ వేయాలన్నా.. గేర్ మార్చాలన్నా.. చేతితో ఆపరేట్ చేయొచ్చు. దీన్ని రోడ్ పైన కూడా హ్యాండిల్ చేయొచ్చు. ఈ రకంగా ఉపయోగపడేందుకు మూడు చక్రాలు కూడా అమర్చారు.
సరైన సస్పెన్షన్ పెట్టి.. రోడ్ కు సూట్ అయ్యేలా చేశారు. మిగిలినవన్నీ అంతకు ముందులాగే ఉంచేశారు. ఇక రోడ్ పైనే కాకుండా గాలిలోనూ ప్రయాణించాలని ట్రై చేశాడు ఆనంద్. అలా కూడా సక్సెస్ అయ్యాడు. వెనుక పెద్ద రెక్కలు ఏర్పాటు చేసి ఎయిర్‌క్రాఫ్ట్ లా మార్చాడు. అంటే బజాజ్ పల్సర్ ఇంజిన్ తో గాలిలో కూడా జర్నీ చేసేస్తున్నాడు. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి మరి..