Coromandel Express Accident: ఘోర రైలు ప్రమాదం, సహాయ కార్యక్రమాలు ముమ్మరం

Coromandel Express Accident : శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు.

Coromandel Express Accident: ఘోర రైలు ప్రమాదం, సహాయ కార్యక్రమాలు ముమ్మరం

Coromandel Express Accident

Updated On : June 2, 2023 / 9:15 PM IST

Coromandel Express Accident: ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ జిల్లా కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ఘోర ప్రమాద ఘటనతో స్థానిక ప్రజలు, రైల్వే అధికారులు, పోలీసులు సహాయ పనులు చేపట్టారు.

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని షాలిమార్ రైల్వే స్టేషన్ నుంచి తమిళనాడులోని చెన్నై సెంట్రల్ స్టేషన్ కు వస్తుండగా బాహానాగబజార్ స్టేషన్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి 7.20 గంటలకు జరిగిన ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. యాక్సిడెంట్ రిలీఫ్ రైలు సంఘటన స్థలానికి బయలుదేరింది.