Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్రకు బ్రేక్.. కాసేపట్లో ఢిల్లీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

భారత్‌ జోడో యాత్రకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కాసేపట్లో రాహుల్ గాంధీ కేరళ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్లను సెప్టెంబరు 24 నుంచి 30 మధ్య స్వీకరిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన సమయంలో రాహుల్ ఢిల్లీకి వెళ్తుండడం గమనార్హం. మళ్ళీ సెప్టెంబరు 24 నుంచి తన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీతో కలిసి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు.

Bharat Jodo Yatra: భారత్‌ జోడో యాత్రకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కేరళలో భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, కాసేపట్లో రాహుల్ గాంధీ కేరళ నుంచి ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి కోసం నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నామినేషన్లను సెప్టెంబరు 24 నుంచి 30 మధ్య స్వీకరిస్తారు. నోటిఫికేషన్ విడుదలైన సమయంలో రాహుల్ ఢిల్లీకి వెళ్తుండడం గమనార్హం.

మళ్ళీ సెప్టెంబరు 24 నుంచి తన సోదరి, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీతో కలిసి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొననున్నారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ చేయబోరని, ఆయన భారత్ జోడో యాత్రకు మధ్యలో ఢిల్లీకి విడిచిరారని రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ నేత ఒకరు అన్నారు.

అయితే, రాహుల్ ఇవాళ ఢిల్లీ వెళ్తుండడం గమనార్హం. ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక స్వేచ్ఛాయుతంగా, పూర్తి పారదర్శకంగా జరుగుతుందని ఇప్పటికే రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చెప్పారు. రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్ ను నియమిస్తారని కూడా ప్రచారం జరుగుతోంది.

Rahul Gandhi On Congress President: ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికపై తొలిసారి స్పందించిన రాహుల్.. కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు