ఇండియాలో మోడర్నా కొవిడ్-19 వ్యాక్సిన్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న టాటా

ఇండియాలో మోడర్నా కొవిడ్-19 వ్యాక్సిన్ లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న టాటా

Updated On : January 25, 2021 / 11:50 AM IST

Moderna Vaccine: టాటా గ్రూప్ హెల్త్ కేర్ వెంచర్ ఇండియాలో మోడర్నా కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు చర్చలు మొదలుపెట్టింది. ఈ మేరకు ఇండియాలోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ తో టాటా మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్స్ టీమ్ లా ఏర్పడి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. దీనిపై మోడర్నా నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు.

ఫైజర్ లాంటి వ్యాక్సిన్లు మైనస్ 70డిగ్రీల నిల్వ ఉంచాలి. మోడర్నాకు మాత్రం నార్మల్ ఫ్రిడ్జ్ టెంపరేచర్ వద్ద నిల్వ ఉంచితే సరిపోతుంది. అందుకే ఇండియా లాంటి దేశాలకు ఇది బాగా సూట్ అవుతోందని అంటున్నారు. నవంబర్ లో రిలీజ్ అయిన డేటా ప్రకారం.. మోడర్నా 94.1శాతం ఎఫెక్టివ్ గా పనిచేసిందని దాంతో పాటు ఎటువంటి సీరియస్ ఘటనలు చోటు చేసుకోలేదని చెప్తున్నారు.

దీనికి ముందుగా డిసెంబర్ లో యునైటెడ్ స్టేట్స్ అప్రూవల్ ఇచ్చింది. యూరప్ లో తర్వాత ఆమోదం దక్కించుకుంది. వ్యాక్సినేషన్ చేయాలంటే కచ్చితంగా లోకల్ స్టడీ నిర్వహించాలని ఇండియా చెప్తుంది. యునైటెడ్ స్టేట్స్ తర్వాత కొవిడ్-19 కేసులు ఇండియాలోనే తర్వాతి స్థానంలో ఉన్నాయి. సెప్టెంబరులో తారాస్థాయికి చేరిన కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.

స్థానికంగా కొవీషీల్డ్ గా బ్రాండ్ సంపాదించుకున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ 70.42శాతం మెరుగ్గా పనిచేస్తుందని ఇండియా డ్రగ్స్ కంట్రోలర్ చెప్తున్నారు. కానీ భారత్ బయోటెక్ కొవాక్సిన్ కు ఎక్కువ శాతం విమర్శలు ఎదుర్కొంటోంది.