Stalin writes to Modi: దేశంలో హిందీ మాట్లాడేవారి కన్నా మాట్లాడని వారే ఎక్కువ: సీఎం స్టాలిన్
హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ‘‘దేశంలో హిందీ మాట్లాడేవారి కన్నా మాట్లాడని వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి భాషను ప్రత్యేకత ఉంది. ప్రజలందరిపైనా హిందీ భాషను రుద్దాలని అనుకోవడం సరికాదు. ఇది సాధ్యంకానిది. ఈ తీరు హిందీ మాట్లాడని వారిలో అనేక అంశాల్లో ప్రతికూలంగా మారుతుంది’’ అని స్టాలిన్ విమర్శించారు.

Tamil Nadu CM Stalin slams national new education policy
Stalin writes to Modi: హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తాజాగా, ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారు. ‘‘దేశంలో హిందీ మాట్లాడేవారి కన్నా మాట్లాడని వారే ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి భాషను ప్రత్యేకత ఉంది. ప్రజలందరిపైనా హిందీ భాషను రుద్దాలని అనుకోవడం సరికాదు. ఇది సాధ్యంకానిది. ఈ తీరు హిందీ మాట్లాడని వారిలో అనేక అంశాల్లో ప్రతికూలంగా మారుతుంది’’ అని స్టాలిన్ విమర్శించారు.
‘‘తమిళనాడుకే కాదు.. మాతృభాషను గౌరవించే, దానికి విలువ ఇచ్చే ఏ రాష్ట్రానికీ సమ్మతం కాదు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం విద్య, ఉద్యోగం వంటి వాటిల్లో అన్ని భాషలనూ ప్రోత్సహించాలి’’ చెప్పారు. హిందీని ప్రజలపై రుద్దాలని చేస్తున్న ప్రయత్నాలను ఆపేయాలని ఆయన కోరారు. వివిధ భాష ప్రజల మధ్య ఉన్న సోదర భావం ‘ఒకే దేశం’ పేరిట హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల నాశనం అవుతుందని చెప్పారు. దేశ సమగ్రతకు కూడా ఇది ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..