100% ఫేస్ మాస్క్ వాడితే COVID-19 మూడో వేవ్ వచ్చినా నివారిస్తుంది : అధ్యయనం తేల్చేసింది

  • Publish Date - June 13, 2020 / 09:10 AM IST

ప్రపంచమంతా కరోనాతో నిండిపోయింది. ఎక్కడ చూసినా కరోనా కేసులు, మరణాలతో ప్రపంచ దేశాలు అల్లాడి పోతున్నాయి. కరోనాకు ఎలాగూ మందు లేదు.. ఉన్నది రెండే రెండు ఆయుధాలు.. ఒకటి సామాజిక దూరం.. రెండోది.. ఫేస్ మాస్క్.. ఇవే.. కరోనా వైరస్ నుంచి రక్షించే అస్త్రాలు.. ఇలాంటి పరిస్థితుల్లో బయటకు వెళ్లినా, ఆఫీసులకు వెళ్లినా తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలి. చేతులు కూడా తరచుగా శానిటైజ్ చేస్తుండాలి. ఫేస్ మాస్క్ లతో కరోనాను పూర్తిగా కట్టడి చేయొచ్చా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, 100 శాతం ఫేస్ మాస్క్ వాడితే రాబోయే రోజుల్లో కొవిడ్-19 రెండవ లేదా మూడో వేవ్ వచ్చినా అణిచివేయగలవు అని అంటోంది ఓ కొత్త అధ్యయనం.

SFGate రిపోర్టు ప్రకారం.. Cambridge, Greenwich universities నుంచి కొత్త మోడలింగ్ అధ్యయనం కొత్త కరోనావైరస్ భవిష్యత్తు వ్యాప్తిని నివారించడంలో మొదట అనుకున్నదానికంటే ఫేస్ మాస్క్ వాడకం చాలా ముఖ్యమైనదిగా సూచిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి, వైరస్ పునరుత్పత్తి సంఖ్య (ఒక సోకిన వ్యక్తి నుంచి వ్యాపించే వ్యక్తుల సగటు సంఖ్య) 1.0 కన్నా తక్కువకు పడిపోవాలి’ అని నివేదిక తెలిపింది. లాక్‌డౌన్‌లతో మాత్రమే ఇది సాధించగలదని పరిశోధకులు విశ్వసించనప్పటికీ.. లాక్‌డౌన్‌లతో పాటు 100 శాతం మాస్క్ ధరించడం ద్వారా అణిచివేయొచ్చునని చెప్పారు.

‘ఫేస్ మాస్క్‌లు ప్రజలందరికీ ఎప్పటికప్పుడు ఉపయోగించినప్పుడు (లక్షణాలు తొలుత నుంచి మాత్రమే కాదు) ప్రభావవంతమైన వైరస్ వ్యాప్తి సంఖ్య 1 కన్నా తక్కువకు తగ్గించవచ్చునని అంటున్నారు. అంటువ్యాధి వ్యాప్తిని తగ్గించడానికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు Proceedings of the Royal Society రాసుకొచ్చారు. SFGate నివేదిక ప్రకారం.. మోడలింగ్ అధ్యయనం లాక్ డౌన్ సమయంలో 100శాతం ఫేస్ మాస్క్ వాడకంతో కలిపినప్పుడు, వ్యాధి వ్యాప్తి చాలా వరకు తగ్గిపోతుందని తెలిపింది. 18 నెలల వైరస్ వ్యాప్తిని నివారిస్తుంది. బయటకు వెళ్లినప్పుడు మాస్క్‌లు ధరిస్తే.. లక్షణాలు కనిపించిన తర్వాత మాత్రమే ఫేస్ మాస్క్ ధరిస్తే.. కంటే R సంఖ్యను తగ్గించడంలో ఇది రెండు రెట్లు ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించింది.

ఎలాంటి మాస్క్‌లు ఉత్తమం?
ఫేస్ మాస్క్‌ల్లో టాప్-ఆఫ్-ది-లైన్ సర్జికల్ లేదా రెస్పిరేటర్ మాస్క్‌లు కానవసరం లేదని అధ్యయనం తెలిపింది. ఇంట్లో తయారు చేసిన మాస్క్‌ల ద్వారా 50శాతం నోటి తుంపర్లను మాత్రమే రక్షణ అందించగలవని వారు తేల్చారు. మాస్క్ ధరించడం ఇతరులను ప్రమాదంగా భావించే సంకేతం కాదు. మాస్క్ ధరించడం వల్ల ముఖ్యంగా ఇతర మార్గాల కంటే ఇతరులను మీ నుంచి రక్షిస్తుందని తెలిపింది.