old man advice
old man advice : ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్లు సలహాలు చెబుతుంటే చాలామంది పాటించరు. నిజానికి అప్పటి తరం వారు ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఆరోగ్యంగా 90 ఏళ్లు బతికారంటే వారి జీవన విధానం తెలుసుకోవాల్సిందే. పాటించాల్సిందే. ఓ శతాధిక వృద్ధుడు జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఎలా గడపాలో చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘పెద్దల మాట చద్దన్నం మూట’ అంటారు. ఎన్నో అనుభవాల నుంచి వారు సలహాలు, సూచనలు చెబుతారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ అయిన 100 ఏళ్ల వృద్ధుడు జాక్ (jack) విలువైన జీవిత పాఠాలు అందర్నీ ఆలోచింపచేస్తున్నాయి. ‘నా అనుభవాల నుంచి చెబుతున్న ఓ సలహా వినమంటూ.. ఆ పెద్దాయన వీడియోలో చెప్పడం మొదలుపెట్టాడు. ప్రకృతితో మమేకమవుతూ బయట తిరగండి.. స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండండి. మీ ఇరుగు-పొరుగు వారితో సఖ్యతగా మెలగండి. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోండి. సెల్ ఫోన్ అనే మ్యాజిక్ మిర్రర్‌ని వదిలిపెట్టి బయట ప్రపంచాన్ని చూడండి.. మీ కళ్లముందు మబ్బు తెరలు తొలగిపోతాయంటూ’ అంటూ తన సలహాను ముగించాడు.
Saree Walkathon : సూరత్ లో 15000 మంది మహిళల “శారీ వాకథాన్”..భారత్‌లో అతి పెద్ద రికార్డ్
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ల్యూక్ స్కాట్ (Luke Scott) ఒక మంచి సలహా ఇచ్చారనే శీర్షికతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోని అనేకమంది చూసారు. మీరు మరిన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం అని కొందరు.. మమ్మల్ని మీలాగ ఉండగలిగేలా ఆశీర్వదించండి జాక్ అంకుల్ .. అని మరికొందరు అభిప్రాయాలు పోస్ట్ చేశారు. భవిష్యత్ తరాలకు విలువైన సలహాలను ఇచ్చిన పెద్దాయన జాక్‌కి తప్పకుండా కృతజ్ఞతలు చెప్పాలి.