amritsar golden temple : గోల్డెన్ టెంపుల్ లోకి రానీయకుండా మహిళను అడ్డుకున్న సిబ్బంది.. కారణం ఏంటంటే? ఆ మహిళ…

అమృత్‌సర్‌ గోల్డెన్ టెంపుల్ సందర్శించడానికి వచ్చిన ఓ మహిళను సిబ్బంది అడ్డుకున్నారు. జాతీయ జెండాలోని రంగుల్ని ముఖంపై టాటూలా వేసుకుని రావడం అందుకు కారణమని తెలుస్తోంది.

amritsar golden temple : గోల్డెన్ టెంపుల్ లోకి రానీయకుండా మహిళను అడ్డుకున్న సిబ్బంది.. కారణం ఏంటంటే? ఆ మహిళ…

amritsar golden temple

amritsar golden temple : అమృత్‌సర్‌లోని (amritsar) గోల్డెన్ టెంపుల్‌ని (golden temple) సందర్శించడానికి రోజూ దేశ వ్యాప్తంగా అనేకమంది సందర్శకులు వస్తుంటారు. రీసెంట్‌గా టెంపుల్ దర్శనానికి వచ్చిన ఓ మహిళను లోనికి వెళ్లనీయకుండా సిబ్బంది అడ్డుకున్నారు. ఆమె తన ముఖం మీద జాతీయ జెండాలోని మూడు రంగుల్ని ముద్రించుకుని వెళ్లడమే అందుకు కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వాడి-వేడిగా చర్చ జరుగుతోంది.

KTR : మంత్రి కేటీఆర్ స్వీట్ మెమరీస్.. చిన్ననాటి ఫోటో వైరల్

అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్ ఎప్పటిలాగే సందర్శకులతో బిజీగా ఉంది. ముఖం మీద జాతీయ జెండాలోని (indian flag) మూడు రంగుల్ని చిత్రించుకుని ఓ మహిళ అక్కడికి వచ్చింది. ఆమె లోనికి వెళ్లేంతలో టెంపుల్ సిబ్బంది ఒకరు అడ్డుకున్నారు. ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించినందుకు ఆమె ముఖంపై ఉన్న జాతీయ జెండా చిత్రమే కారణమని సిబ్బంది చెప్పారు. తనకు అలా వచ్చేందుకు స్వేచ్ఛ ఉందని తాను భారతదేశంలో ఉన్నానని.. పంజాబ్ భారత్‌లో లేదా అని తిరిగి ఆ మహిళ ప్రశ్నించింది.  ఇక అక్కడి నుంచి ఆ మహిళకు, సిబ్బందికి మధ్య తీవ్ర స్ధాయిలో వాగ్వాదం జరిగింది.  ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న వారిని సైతం సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Kallakurichi collector in controversy : అటెండర్‌ని షూస్ తీసుకెళ్లమంటూ కలెక్టర్ ఆర్డర్.. ఏకిపారేస్తున్నజనం వీడియో వైరల్

ఇక ఈ ఘటనపై ఎస్‌జిపిసి ప్రధాన కార్యదర్శి గురుశరణ్‌సింగ్ గ్రేవాల్ (Gurcharan Singh Grewal) స్పందించారు. ఈ ఘటనపై పూర్తి విచారణ చేపట్టినట్లు తెలిపారు. మహిళపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తిపై చర్యలు చేపట్టామని.. తమ సిబ్బంది తప్పిదం ఉంటే క్షమాపణలు కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ‘ఖలిస్ధానీయులు గోల్డెన్ టెంపుల్‌ని స్వాధీనం చేసుకున్నారు’ అనే శీర్షికతో షేర్ అవుతున్న ఈ వీడియోపై అనేకమంది స్పందిస్తున్నారు.