Kallakurichi collector in controversy : అటెండర్‌ని షూస్ తీసుకెళ్లమంటూ కలెక్టర్ ఆర్డర్.. ఏకిపారేస్తున్నజనం వీడియో వైరల్

ఓ కలెక్టర్ గారు తన అసిస్టెంట్ పట్ల ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో జనం ఆగ్రహానికి కారణం అవుతోంది. షూస్ తీసి అసిస్టెంట్ ని తీసుకెళ్లమనడం వివాదాస్పదమైంది. ఇదంతా వీడియోలో కనిపిస్తుంటే కాదంటున్న ఆ కలెక్టర్ గారిని జనం తిట్టిపోస్తున్నారు.

Kallakurichi collector in controversy : అటెండర్‌ని షూస్ తీసుకెళ్లమంటూ కలెక్టర్ ఆర్డర్.. ఏకిపారేస్తున్నజనం వీడియో వైరల్

Kallakurichi collector in controversy

Kallakurichi collector in controversy : ఓ కలెక్టర్ గారు (collector) ఆలయానికి వెళ్లారు. లోనికి వెళ్లే ముందు షూస్ తీసి అటెండర్ ని (assistant) పిలిచి వాటిని తీసుకెళ్లమన్నారు. ఇప్పుడు ఈ విషయమే వివాదాస్పదంగా మారింది. అయితే వీడియోలో కనపడేది అంతా బూటకం అంటున్నారు ఆ కలెక్టర్ గారు.

Woman walked on the river : నర్మదా నదిపై నడుచుకుంటూ వెళ్లిన వృద్ధురాలు .. దేవత అంటూ ప్రచారం.. వీడియో వైరల్

కళ్లకురిచి (Kallakurichi) కలెక్టర్ (collector) శ్రావణ్ కుమార్ (Sravan Kumar) ఉలుందూరుపేట సమీపంలోని కూవాగం గ్రామంలోని (Koovagam village) కూతాండవర్ ఆలయానికి (Koothandavar temple) వెళ్లారు. ఈనెల 18న ఆలయంలో జరగబోయే చితిరై పండుగ (chithirai festival) ఏర్పాట్లను సమీక్షించేందుకు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వెంట పోలీస్ సిబ్బంది, పంచాయతీ అధికారులతో పాటు ఇతర అధికారులు ఉన్నారు. గుడిలోకి ప్రవేశించబోతున్న కలెక్టర్ గారు తన షూస్ తీసారు. అటెండర్ దఫేదార్‌ను (Daffedar) పిలిచి తన షూస్ (shoes) తీసుకెళ్లమన్నట్లు సైగ చేశారు. ఇక్కడి వరకూ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇదంతా కల్పితమంటున్నారు ఆ కలెక్టర్ గారు. కావాలని ఎవరో ఆ వీడియోని ఎడిట్ చేశారని ఆరోపిస్తున్నారు. అసలు తను ఎప్పుడు ఎవరికీ తన ష్యూస్ క్యారీ చేయమని చెప్పలేదని వాపోతున్నారు.

Naatu Naatu : ఇంకా తగ్గని నాటు నాటు క్రేజ్.. వైరల్ అవుతున్న బేస్ బాల్ స్టేడియం!

కలెక్టర్ గారు లోనికి వెళ్తూ తనిఖీలు చేయవలసిన ప్రాంతానికి వెళ్లడానికి రెవెన్యూ అధికారి, బ్లాక్ డెవలప్ మెంట్ సిద్ధంగా ఉండమని చెప్పమని మాత్రమే తన అసిస్టెంట్ దఫేదార్ కి చెప్పినట్లు శ్రవణ్ కుమార్ అంటున్నారు. తన కొత్త అసిస్టెంట్ దఫేదార్ కూడా మంగళవారమే డ్యూటీలో చేరినట్లు ఆయన చెప్పుకొచ్చారు. కానీ వీడియోలో కనిపించేది మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక ఈ వీడియో చూసిన వారంతా కలెక్టర్ శ్రవణ్ కుమార్‌పై మండిపడుతున్నారు. ఒక హోదాలో ఉన్న వ్యక్తి ప్రవర్తించాల్సిన తీరు ఇది కాదని తక్కువస్ధాయి ఉద్యోగి పట్ల ఇలా ప్రవర్తించడం సరికాదని కలెక్టర్‌ని తిట్టిపోస్తున్నారు. ఇంత జరిగినా ఆ కలెక్టర్ తాను ఆ పని చేయలేదు అనడం హాస్యాస్పందంగా అనిపిస్తోంది. ఆ వీడియోలో కనిపించేదంతా వాస్తవమా.. లేక నిజంగా ఎడిట్ చేశారా? అన్నది అక్కడ ప్రత్యక్షంగా ఉన్న జనానికి, ఆ గుళ్లో దేవుడికి తెలియాలి. ప్రస్తుతానికి ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కలెక్టర్ తీరుని జనం ఎండగడుతున్నారు.