New York metro : మెట్రోలో పరుపు వేసుకుని పడుకున్న వ్యక్తి వీడియో వైరల్

మెట్రోలో వైరల్ న్యూస్ సర్వసాధారణం అయిపోయాయి. అయితే రోజు ఎలాంటి వీడియో బయటకు వస్తుందా? అని జనం వెయిట్ చేస్తున్నారు. న్యూయార్క్ మెట్రోలో ఓ వ్యక్తి ఎంత హాయిగా నిద్రపోయాడో ఈ స్టోరీలో చదవండి.

New York metro : మెట్రోలో పరుపు వేసుకుని పడుకున్న వ్యక్తి వీడియో వైరల్

New York metro

ఎవరూ చేయని వింత వింత పనులు చేయడం.. వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం.. అక్కడి నుంచి పాపులర్ అవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. సాధారణంగా చాలా రష్ గా ఉన్నప్పుడు కూర్చోవడానికే చోటు దొరకని మెట్రోలో ఓ వ్యక్తి పరుపు వేసుకుని మరీ నిద్రపోవడం ఇప్పుడు వైరల్ అవుతోంది. అది ఎక్కడంటే న్యూయార్క్ (New York) సిటీలో..

వింటేజ్ లుక్స్ తో వైరల్ అవుతున్న దివి

దేశ రాజధాని ఢిల్లీ (delhi) మెట్రోలో (metro) రోజుకో వీడియో వైరల్ అవుతోంది. రీసెంట్ గా కూడా ఓ అమ్మాయి వేసుకున్న వస్త్రధారణపై పెద్ద డిబేట్ జరిగింది. ఇప్పుడు న్యూయార్క్ మెట్రోలో జరిగిన ఓ సంఘటన బయటకు వచ్చింది. మెట్రోలు ఎప్పుడు జనంతో కిటకిటలాడుతూ ఉంటాయి. నిలబడటానికే చోటు ఉండదు. అలాంటిది ఓ కుర్రాడికి బెడ్ పరుచుకుని పడుకునేంత ప్లేస్ దొరికింది. ప్రిన్స్ జీ (Prince Zee)అనే కుర్రాడు తన వెంటన ఓ బెడ్ ను తెచ్చుకున్నాడు నెమ్మదిగా దానిని పరుచుకుని బెడ్ పై ప్రశాంతంగా నిద్రపోయాడు. అంతమంది చూస్తున్నా ఏ మాత్రం బెరుకులేకుండా అతను బెడ్ పరుచుకుని పడుకున్న విధానం చూసి తోటి ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో క్లిప్ ప్రిన్స్ జీ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

Groceries on Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కిరాణా సామాన్లు తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో వైరల్

మెట్రోలో ఇలాంటివి జరుగుతుంటే జనం పట్టించుకోరేంటి? అని కొందరు.. అతని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకుంటూ కొందరు కామెంట్లు పెట్టారు. నిద్ర చోటెరగదు అంటారు. ప్రిన్స్ జీని చూస్తే అదే అనిపిస్తోంది.