Groceries on Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కిరాణా సామాన్లు తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో వైరల్

కొన్ని ఐడియాలు సమయాన్ని, చోటుని వృధా కానీయకుండా చేస్తాయి. అలాంటి క్రియేటివ్ ఆలోచనలు రావాలంటే బ్రైన్ చాలా షార్ప్ అయ్యి ఉండాలి. కిరాణా సామాన్లు ఏ హడావిడి లేకుండా సింపుల్‌గా ఇంటికి తీసుకువెళ్లచ్చునో ఈ స్టోరి చదవండి.

Groceries on Scooter : ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కిరాణా సామాన్లు తీసుకెళ్తున్న వ్యక్తి వీడియో వైరల్

Groceries on Scooter

Groceries on Scooter :  కిరణా షాపుకి వెళ్లి సామాన్లు (groceries) తీసుకురావాలంటే సొంత కారైనా ఉండాలి.. లేదంటే ఆటోలో అయినా రావాలి. మనిషి నిలబడటానికి మాత్రమే చోటుండే ఎలక్ట్రిక్ స్కూటర్  (Electric scooter) మీద ఓ వ్యక్తి ఎన్ని సామాన్లు తీసుకెళ్లాడో చూస్తే ఆశ్యర్యపోతారు. అతని సమయస్ఫూర్తిని మెచ్చుకోకుండా ఉండలేరు.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

ఓ వ్యక్తి ఎంతో ఉపాయంతో కిరాణా సామాగ్రి అంతా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఎలా తీసుకువెళ్లగలిగాడో చూస్తే వావ్ అంటారు. వాల్ మార్ట్ (Walmart) పార్కింగ్ ప్లేస్‌లో ఒకతను తన ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపాడు. తన వెంట తెచ్చుకున్న కారాబైనర్లు (carabiners) అమర్చబడిన రిఫ్లెక్టివ్ జాకెట్‌ను (reflective jacket) ధరించాడు. ఒక్కో సామాగ్రి కవర్‌ను జాకెట్ కి తగిలించుకున్నాడు. చివర్లో మిగిలిన పుచ్చకాయను బేబీ క్యారియల్‌లో (baby carrier) పెట్టుకుని నడుముకు చుట్టుకున్నాడు. తన సంచుల్ని సరిచేయడానికి అక్కడ కారులో ఉండి ఇదంతా చూస్తున్న వ్యక్తి సాయం కూడా తీసుకున్నాడు. అంతే బైక్ స్టార్ట్ చూసి కూల్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను లెవాండోవ్ (@blabla112345) అనే ట్విట్టర్ యూజర్ ఆన్‌లైన్‌లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

good thieves : దొంగిలించిన నగదు తిరిగిచ్చేసి పోలీసులకు షాక్ ఇచ్చిన దొంగలు.. వింత సంఘటన వైరల్

ప్రతి వారం కిరాణా సామాగ్రి ఇలాగే ఇంటికి తీసుకువెళ్తుంటాడట.. అలా కెమెరాకు చిక్కాడన్నమాట. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. ఇలా కూడా సామాను తీసుకువెళ్తారా? అని కొందరు.. అతని క్రియేటివిటీని మెచ్చుకుంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏదైనా షాపింగ్ అంటే హడావిడి చేసి వస్తువుల్ని కూడా చెల్లాచెదురు చేసుకునే వాళ్లు ఈ వ్యక్తి వీడియో చూసి చాలా నేర్చుకోవాలి.