ఓ పిల్లాడు తన ఇంట్లో కత్తులు, ఎయిర్‌సాఫ్ట్ రైఫిల్స్, పిస్టల్స్, నకిలీ మందుగుండు సామగ్రిని పెద్ద ఎత్తున నిల్వ చేసి పెట్టుకున్నాడు. తన స్కూలు వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న ఆయుధాలకు సంబంధించిన వీడియోను కొందరు పిల్లలకు చూపించాడు.
తాను కొందరి పేర్లను రాసిపెట్టుకున్నానని, వారిని చంపేయాలనుకుంటున్నానని బెదిరించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ బాలుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. అమెరికాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వోలుసియా షెరీఫ్ కార్యాలయ పోలీసు అధికారి మైక్ చిట్‌వుడ్ తన ఫేస్‌బుక్‌లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలిపారు.
ఆ బాలుడిని తాము విచారించగా.. తాను బెదిరించలేదని, తన స్నేహితులతో జోక్ చేశానని అన్నాడని ఆ అధికారి తెలిపారు. అయినప్పటికీ, కాల్పులకు తెగబడతానని బెదిరించినందుకు ఆ బాలుడిపై కేసు నమోదు చేశామని చెప్పారు.
ఇటువంటి నేరాలకు పాల్పడే పిల్లల ఫొటోలను తాము పోస్ట్ చేస్తూనే ఉంటామని తెలిపారు. భయంకర రీతిలో ప్రాంక్ బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ఇటీవలే హెచ్చరించారు. అమెరికాలో చిన్నారులు సైతం కాల్పుల ఘటనలకు పాల్పడుతున్న నేపథ్యంలో పోలీసులు అలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
Donald Trump: వచ్చే వారం ప్రధాని మోదీని కలుస్తాను: డొనాల్డ్ ట్రంప్