Donald Trump: వచ్చే వారం ప్రధాని మోదీని కలుస్తాను: డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

Donald Trump: వచ్చే వారం ప్రధాని మోదీని కలుస్తాను: డొనాల్డ్ ట్రంప్

MODI-TRUMP

Updated On : September 18, 2024 / 9:28 AM IST

భారత ప్రధాని నరేంద్ర మోదీని తాను వచ్చేవారం కలుస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. నరేంద్ర మోదీ ‘ఫన్‌టాస్టిక్’ అని ట్రంప్ అన్నారు. మంగళవారం నిర్వహించిన ఓ సభలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ట్రంప్ తీరికలేకుండా గడుపుతున్నారు.

ప్రధాని మోదీ సెప్టెంబరు 21 నుంచి 23 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. క్వాడ్ సమ్మిట్‌లో మోదీ పాల్గొంటారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్’లోనూ మోదీ ప్రసంగిస్తారు.

డెలావేర్‌లోని విల్మింగ్‌టన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హోస్ట్‌గా నిర్వహిస్తున్న నాలుగో క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఇది. వచ్చే ఆదివారం మోదీ న్యూయార్క్‌లోని ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

కృత్రిమ మేధ, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్స్, బయోటెక్నాలజీ వంటి రంగాలలో ఇరు దేశాల మధ్య మరింత సహకారాన్ని పెంపొందించడానికి అమెరికాలోని కంపెనీల సీఈవోలతో కూడా మాట్లాడతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై సర్కారు కీలక నిర్ణయం