ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై సర్కారు కీలక నిర్ణయం

పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై సర్కారు కీలక నిర్ణయం

Updated On : September 18, 2024 / 8:58 AM IST

Distribution of pensions: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ల పంపిణీ మార్గదర్శకాల్లో సవరణలు చేసింది. 1వ తేదీ సెలవు రోజుగా ఉంటే ఆ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి డబ్బులు అందించాలని చెప్పింది. రెండో తేదీన మిగిలిన పంపిణీ పూర్తిచేయాలని, ఆ రోజూ సెలవు ఉంటే మూడో తేదీన పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. పంపిణీని ప్రారంభించిన తొలి రోజే దాదాపు 100 శాతం పూర్తి చేసేందుకు ప్రయత్నించాలని ఆదేశించింది.

నేడు ఎన్డీయే శాసనసభా పక్ష భేటీ
అమరావతిలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన ఇవాళ ఎన్డీయే శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. సాయంత్రం మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయ సమీపంలోని సీకే కన్వెన్షన్లో సమావేశం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్య క్షురాలు పురందేశ్వరి సహా కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్నందున చేపట్టాల్సిన కార్యక్రమాలపై భేటీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 20 నుంచి 26 వరకు ఎమ్మె ల్యేలు ఇంటింటికీ వెళ్లి 100 రోజుల పాలనను వివరించేలా కార్యాచరణ రూపొందిస్తారు.

Jammu election: జమ్మూకశ్మీర్‌లో తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం