Mexican Boy: జాతి వివక్షతో 14ఏళ్ల మెక్సికన్ విద్యార్థికి నిప్పటించిన తోటి స్టూడెంట్స్

స్థానిక భాష మాట్లాడటమే నేరంగా భావించి.. తరగతి గదిలోనే తోటి విద్యార్థులంతా కలిసి మెక్సికన్ విద్యార్థికి నిప్పంటించారు. జూన్‌ నెలలో సెంట్రల్ స్టేట్ క్వెరెటాలోని హైస్కూల్ లో జువాన్ జామోరానో కూర్చొనే సీటుపై ఇద్దరు విద్యార్థులు మద్యంపోశారు.

Racial Attack

 

 

Mexican Boy: స్థానిక భాష మాట్లాడటమే నేరంగా భావించి.. తరగతి గదిలోనే తోటి విద్యార్థులంతా కలిసి మెక్సికన్ విద్యార్థికి నిప్పంటించారు. జూన్‌ నెలలో సెంట్రల్ స్టేట్ క్వెరెటాలోని హైస్కూల్ లో జువాన్ జామోరానో కూర్చొనే సీటుపై ఇద్దరు విద్యార్థులు మద్యంపోశారు. కాసేపటికి 14ఏళ్ల విద్యార్థికి తన బట్టలు తడిచాయని గుర్తించి పైకి లేచాడు.

ఆ వివాదం పెద్దదై తోటి విద్యార్థులే అతనికి నిప్పటించారు. రెండు, మూడు డిగ్రీల గాయాలకు గురై వారం రోజుల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ ఘటనపై కేసు ఫైల్ చేసిన బాధితుడు తరపు లాయర్లు స్కూల్ అథారిటీలను నిందితుడిగా పేర్కొన్నారు.

లాటిన్ అమెరికన్ దేశంలోని డజన్ల కొద్దీ గ్రూపులలో ఒటోమి ఒకటి. ఒటోమి భాషనే జువాన్ మాతృభాష. కానీ దానిని మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడడు. ఎందుకంటే ఇది అపహాస్యం, వేధింపులు, బెదిరింపులకు గురి కావాల్సి వస్తుందని భయపడి అలా చేస్తుండే వాడని తన తరపు న్యాయవాదులు అంటున్నారు.

Read Also: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన

భాష కారణంగానే జామోరానో ఉపాధ్యాయుడు కూడా వేధింపులకు గురి చేశాడని కుటుంబం ఆరోపణలు చేసింది. ఈ ఘటన అనంతరం స్థానిక నాయకులు వివక్షను అరికట్టాలని, భాష ప్రాతిపదికన కించపరచడం కరెక్ట్ కాదని ధ్వజమెత్తారు.