Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన

జాతి, వర్ణ వివక్షపై అలుపెరగని పోరాటం అనంతరం..నల్ల జాతీయులకు స్వేచ్ఛ వాయువులు అందించిన దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది.

Racism in South Africa: దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన

South Africa

Racism in South Africa: జాతి, వర్ణ వివక్షపై అలుపెరగని పోరాటం అనంతరం..నల్ల జాతీయులకు స్వేచ్ఛ వాయువులు అందించిన దక్షిణాఫ్రికాలో మరోమారు జాతి, వర్ణ వివక్ష ఘటన చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. అదీ సౌత్ ఆఫ్రికాలోనే టాప్ యూనివర్సిటీలో చోటుచేసుకోవడం ఘటనపై మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది. నల్లజాతి విద్యార్థికి చెందిన పుస్తకం, ల్యాప్‌టాప్‌పై తెల్లజాతి విద్యార్థి మూత్ర విసర్జన చేసిన ఘటన ఇప్పుడు దక్షిణాఫ్రికాలో సంచలనంగా మారింది. దక్షిణాఫ్రికాలో స్టెల్లెన్‌బోష్ యూనివర్సిటీలో మొదటి సంవత్సరం నల్లజాతి విద్యార్థి గదిలోకి తెల్లజాతి విద్యార్థి ప్రవేశించి నేరుగా మూత్ర విసర్జన చేశాడు.

Other Stories:Warren Buffett: అందరు వెనక్కు తగ్గుతున్న టైంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న ప్రపంచ కుబేరుడు బఫెట్

దీనిపై బాధిత విద్యార్థి ప్రశ్నించగా..”నల్ల జాతి వాళ్లకు మేము ఇలాగే చేస్తాము” అంటూ తెల్ల జాతి విద్యార్థి సమాధానం ఇచ్చాడు. అయితే గదిలో ఉన్న మరొక విద్యార్థి ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి..యూనివర్సిటీ యాజమాన్యం మరియు విద్యార్థి సంఘాల దృష్టికి తీసుకువెళ్లాడు. అయితే ఆ వీడియో కాస్త బయటకు రావడంతో సోమవారం నాడు దేశ వ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు చోటుచేసుకున్నాయి. ఇక ఈఘటనలో బాద్యుడైన శ్వేత జాతి విద్యార్థిని యూనివర్సిటీ సస్పెండ్‌ చేసింది. యూనివర్శిటీ వైస్-ఛాన్సలర్ విమ్ డివిలియర్స్ కూడా ఈ సంఘటనను ఖండించారు.

Other Stories:Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు

దక్షిణాఫ్రికాలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయంలో వర్ణ వివక్షకు తావు లేదని ఇటువంటి ఘటనలను తాము అస్సలు సహించబోమని చెప్పారు. అదే సమయంలో, దక్షిణాఫ్రికా స్టూడెంట్స్ యూనియన్ ఈ సంఘటనను ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే నేరాలు మరింత పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలను అరికట్టాలంటే శ్వేతజాతి విద్యార్థిని అరెస్ట్ చేయాలని విద్యార్థి యూనియన్ డిమాండ్ చేసింది. మరోవైపు ఈఘటనపై పోలీస్ విచారణ కొనసాగుతుంది.