Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు

చైనా పంపిణీ చేసిన ఆహార రేషన్లపై దేశంలోని ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (FSOA)లో ఆగ్రహావేశాలు రేకెత్తించాయి. పప్పు, బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువుల సరుకులను పంపిణీ చేయడానికి చైనా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది

Sri Lanka Crisis: చైనా పంపిణీ చేసిన రేషన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శ్రీలంక అధికారులు

Sri

Sri Lanka Crisis: తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు చక్క దిద్దేందుకు కొత్త ప్రధాని రణిల్ విక్రమసింగే శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అయితే శ్రీలంకలో తలెత్తిన సంక్షోభం దృష్ట్యా శ్రీలంక విదేశీ అధికారులను ఆదుకునేందుకు అత్యవసర రేషన్ సరుకులను పంపిణీ చేయడానికి చైనా ముందుకు వచ్చింది. ఈక్రమంలో చైనా పంపిణీ చేసిన ఆహార రేషన్లపై దేశంలోని ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ (FSOA)లో ఆగ్రహావేశాలు రేకెత్తించాయి. పప్పు, బియ్యం మరియు ఇతర నిత్యావసర వస్తువుల సరుకులను పంపిణీ చేయడానికి చైనా చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఈ రేషన్లన్నీ చైనా ప్రభుత్వం పంపిణీ చేసినవేనని, అయితే రేషన్ సంచులపై చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ (సిసిపి) ట్రేడ్ మార్క్ కనిపించకుండా అధికారులు దాచారని కొలంబో గెజిట్ నివేదించింది.

Other Stories:AAP-Uttarakhand: ఆప్ సీఎం అభ్యర్థి.. పార్టీకి రాజీనామా

శ్రీలంక విదేశీ మంత్రిత్వ శాఖ సిబ్బందికి చైనా డ్రై రేషన్ పంపిణీ చేయడం లంచం కంటే హేయమైన చర్యగా ఎఫ్ఎస్ఓఎ అభివర్ణించింది. “ప్రపంచంలో ఎక్కడా ఒక రాయబార కార్యాలయం విదేశాంగ మంత్రిత్వ శాఖకు అటువంటి విరాళాన్ని అందించదు, ముఖ్యంగా శ్రీలంక వంటి దేశంలో చైనా వారి ప్రతిష్టాత్మక బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (బిఆర్ఐ)తో ముందుకు సాగడానికి రాజకీయ నాయకులతో తీవ్రంగా నిమగ్నమై ఉంది, ఇది అపారమైన సవాళ్లను ఎదుర్కొంటోంది” అని శ్రీలంక జాతీయ వార్తా సంస్థ తెలిపింది. కాగా, శ్రీలంక విదేశాంగ మంత్రిత్వ శాఖకు చైనా విరాళాన్ని.. విదేశాంగ కార్యదర్శి జయనాథ్ కొలంబేజ్ మరియు చైనా-శ్రీలంక ఫ్రెండ్షిప్ అసోసియేషన్ ఆమోదించింది.

Other Stories:Rahul Gandhi: ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ

రేషన్ కొనుగోలు చేయడానికి చైనా రాయబార కార్యాలయం నుండి వీరు డబ్బు సేకరించినట్లు మీడియా వెల్లడించింది. ఈ పరిణామంపై శ్రీలంక విదేశీ సేవా అధికారుల సంఘం ప్రతినిధి బృందం స్పందిస్తూ విదేశాంగ కార్యదర్శి కొలంబేజ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. “ఇటువంటి విరాళాలను, ముఖ్యంగా శ్రీలంక విదేశీ సేవా సభ్యులు ఆమోదించడం తగినది కాదని తాము విశ్వసిస్తున్నామని, ఇది విదేశీ సేవ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను మరింత ఇబ్బందికరమైన పరిస్థితిలోకి లాగుతుందని అసోసియేషన్ అభిప్రాయ పడింది. ఈ వివరాలను దాచిపెట్టి, ప్రాజెక్టులపై పెత్తనం సాగించేందుకు చైనా ఇప్పటికే ప్రభుత్వానికి చెల్లింపులు కూడా చేసిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.