Rahul Gandhi: ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ

అనేక అంశాల్లో ఇండియాలోనూ శ్రీలంక వంటి పరిస్థితే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టి మళ్లించడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు.

Rahul Gandhi: ఇండియాలోనూ శ్రీలంక పరిస్థితే: రాహుల్ గాంధీ

Rahul Gandhi

Updated On : May 18, 2022 / 7:33 PM IST

Rahul Gandhi: అనేక అంశాల్లో ఇండియాలోనూ శ్రీలంక వంటి పరిస్థితే ఉందని విమర్శించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ప్రజల దృష్టి మళ్లించడం ద్వారా ప్రభుత్వం తన వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. వివిధ అంశాల్లో శ్రీలంకతో, ఇండియాను పోలుస్తూ రాహుల్ గాంధీ బుధవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగం, పెట్రోల్ ధరలు, మత హింస వంటి అంశాల్లో ఇండియా, శ్రీలంకను పోలి ఉందన్నారు. దీనికి సంబంధించిన గ్రాఫ్స్‌ను ఆయన ట్వీట్‌ చేశారు.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్‌గా స్ట్రాటజిస్ట్ సర్వే వ్యవహారం

ప్రజల దృష్టి మరల్చడం ద్వారా వాస్తవాల్ని దాచలేరని విమర్శించారు. ప్రస్తుతం దేశంలో పెరిగిపోతున్న ధరలు, నిరుద్యోగంపై కాంగ్రెస్ పార్టీ, కొంతకాలంగా బీజేపీపై విమర్శలు చేస్తూనే ఉంది. శ్రీలంకలో పెరిగిన ధరలు, నిరుద్యోగం కారణంగా ఆ దేశం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.