Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్‌గా స్ట్రాటజిస్ట్ సర్వే వ్యవహారం

కాంగ్రెస్ లీడర్లు కూడా తమనెవరో నీడలా వెంటాడుతున్నారని.. ఆందోళన చెందుతున్నారు. వాళ్ల నీడను వాళ్లు చూసుకున్నా ఉలిక్కిపడుతున్నారు. ప్రతి నేత కదలికలపై నిఘా పెట్టారని.. దానికో రిపోర్ట్ రెడీ చేస్తారని.. అధి ఢిల్లీకి చేరుస్తారనే టాక్ మొదలైంది. పార్టీ నాయకుల్లో.. ఇప్పుడీ మూడో కన్ను గురించే డిస్కషన్ నడుస్తోంది.

Telangana Congress : తెలంగాణ కాంగ్రెస్ లో హాట్ టాపిక్‌గా స్ట్రాటజిస్ట్ సర్వే వ్యవహారం

Strategist Survey Tension In Telangana Congress

strategist survey tension in Telangana Congress : మొన్నటిదాకా కాంగ్రెస్‌లో ఎలా ఉన్నా నడిచేది. ఏం చేసినా.. పట్టించుకునే నాథుడే కాదు.. నాయకుడు కూడా లేడు. కానీ.. రోజులతో పాటు పార్టీలో పరిస్థితులు కూడా వేగంగా మారుతున్నాయ్. కాంగ్రెస్ లీడర్లు కూడా తమనెవరో నీడలా వెంటాడుతున్నారని.. ఆందోళన చెందుతున్నారు. చివరికి.. వాళ్ల నీడను వాళ్లు చూసుకున్నా ఉలిక్కిపడుతున్నారు. ప్రతి నేత కదలికలపై నిఘా పెట్టారని.. దానికో రిపోర్ట్ రెడీ చేస్తారని.. అధి ఢిల్లీకి చేరుస్తారనే టాక్ మొదలైంది. పార్టీ నాయకుల్లో.. ఇప్పుడీ మూడో కన్ను గురించే డిస్కషన్ నడుస్తోంది.

హస్తం పార్టీలో.. గాంధీ ఫ్యామిలీని తప్ప.. ఎవరినైనా విమర్శించే స్వేచ్ఛ.. ఆ పార్టీ నాయకులకు ఉంటుంది. ఇక్కడి కాంగ్రెస్ లీడర్లు కూడా మొన్నటిదాకా ఇదే ఫాలో అయ్యారు. కానీ.. ఈ మధ్య నాయకుల ప్రవర్తనలో మార్పులొచ్చాయని.. గాంధీభవన్‌లో గంటలకొద్దీ చర్చలు నడుస్తున్నాయ్. అంతా.. ఆ మూడో కన్ను గురించే మాట్లాడుకుంటున్నారు. తమనెవరో వెంటాడుతున్నారని.. తమ కదలికలపై నిఘా పెట్టారనే ఆలోచనలతో.. అనుక్షణం.. అటెన్షన్‌గా ఉంటూనే.. టెన్షన్ ఫీలైపోతున్నారు.

ప్రతి పార్టీకి అనుబంధ సంఘాలున్నట్లే.. ఓ పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌ కూడా ఉంటున్నాడు. తెలంగాణ కాంగ్రెస్ కూడా సునీల్ కనుగోలు అనే ఓ వ్యూహకర్తను నియమించుకుంది. అతనిప్పుడు.. పార్టీ వ్యవహారాలను చాలా డీటైల్డ్‌గా పరిశీలిస్తున్నారు. టాప్ లీడర్లు పాల్గొనే.. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మీటింగ్‌లకు కూడా సునీల్ వెళ్తున్నారు. రాహుల్ గాంధీ దగ్గర జరిగిన ముఖ్య నేతల సమావేశంలోకి కూడా సునీల్ ఎంటరయ్యాడు. ఇప్పుడు.. అతనే ప్రతి లీడర్‌కు సంబంధించిన రిపోర్ట్‌ను రెడీ చేస్తున్నారనే టాక్ మొదలైంది. డైరెక్ట్‌గా.. రాహుల్ గాంధీతోనే.. సునీల్‌కు లింక్ ఉండటంతో.. కాంగ్రెస్ నేతలు అతని పేరెత్తినే హడలిపోతున్నారు.

వరంగల్‌ సభ తర్వాత.. రాహుల్ చేసిన కామెంట్స్.. పార్టీ నేతలను డిఫెన్స్‌లో పడేశాయ్. నాయకులంతా పట్నం వదిలి.. నియోజకవర్గాల్లో ఉండాల్సిందేనని క్లియర్‌గా చెప్పేశారు. జనంలో ఉండకుండా.. గాంధీభవన్ చుట్టూ తిరిగే ఎంత పెద్ద సీనియర్ లీడరైనా.. టికెట్ ఇచ్చేది లేదని తేల్చేశారు. నియోజకవర్గంలో పర్ఫార్మెన్స్‌ని బట్టి.. దాని మీదొచ్చే సర్వే రిపోర్ట్ ఆధారంగానే టికెట్ ఇస్తామని చెప్పారు. దీనికి తోడు పీసీసీ చీఫ్ రేవంత్ కూడా.. ప్రతి మీటింగ్‌లో సర్వేల టాపిక్ తేవడం, స్ట్రాటజిస్ట్ సునీల్ పేరు ప్రస్తావిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ప్రతి నియోజకవర్గంలో.. లీడర్లకు తెలియకుండా సర్వేలు జరుగుతున్నాయని.. పార్టీ కార్యకర్తల్లో టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యకాలంలో.. నల్గొండ లోక్‌సభ స్థానం పరిధిలో.. స్ట్రాటజిస్ట్ సునీల్ 4 రోజుల పాటు పర్యటించారని.. గాంధీభవన్ వర్గాల నుంచి ఓ లీక్ వచ్చింది. ఇదంతా.. వ్యూహాత్మకంగానే జరుగుతున్నట్లు సీనియర్లు చెప్పుకుంటున్నారు. మరోవైపు.. సునీల్ టీమ్.. ప్రతి లీడర్‌ని మూడో కన్నులా వెంటాడుతుందనే లీకులు ఇస్తున్నారు. దీంతో.. ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. ఎక్కడ.. తమ మీద నెగటివ్ రిపోర్ట్ ఇస్తారోనని.. నాయకులంతా.. తమ తమ నియోజకవర్గాల్లో ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

అయితే.. స్ట్రాటజిస్ట్ సునీల్ మాత్రం.. పూర్తిగా పార్టీలోని ఓ ముఖ్యనేత కనుసన్నల్లోనే.. పనిచేస్తున్నట్లు సీనియర్లు అనుమానిస్తున్నారు. రాహుల్‌కు.. తమపై నెగటివ్ రిపోర్ట్ ఇవ్వడం, వరంగల్‌లో పార్టీ నేతలపై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేయడం వెనుక కూడా సునీల్ హస్తం ఉందని నమ్ముతున్నారు. ఏదేమైనా.. థర్టీ, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే లీడర్లంతా.. ఇప్పుడు సర్వే టీమ్‌ల గురించి టెన్షన్ పడుతున్నారు.