Nadendla Manohar: మీటింగ్లో పవన్ కల్యాణ్ మాకు చెప్పింది ఇదే- నాదెండ్ల మనోహర్
సమాజంలో చీలిక తెచ్చేందుకు వైసీపీ అల్లర్లు సృష్టిస్తోందన్నారు. ఎవరైనా నోరు జారి మాట్లాడితే జవాబు చెప్పాల్సిందే అన్నారు.
- పాపం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు
- వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతాం
- సమాజంలో చీలిక తెచ్చేందుకు వైసీపీ కుట్రలు
Nadendla Manohar: జనసేన జనరల్ బాడీ సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. ఈ మీటింగ్ లో రెండు తీర్మానాలపై చర్చించామన్నారు. ఒకటి తిరుమల లడ్డూ, మరొకటి కేంద్ర బడ్జెట్. తిరుమల లడ్డూ కల్తీ అంశాన్ని క్షేత్ర స్థాయిలో ప్రజలకు వివరిస్తామని మంత్రి నాదెండ్ల తెలిపారు. శ్రీవారి డబ్బు రూ.233 కోట్లు దుర్మార్గంగా కొల్లగొట్టారని ఆయన ఆరోపించారు. పాపం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రజలకు వివరిస్తామన్నారు.
పీఏసీని పునరుద్ధరణ చేస్తున్నట్లు వెల్లడించారు. 32 మందితో క్రమశిక్షణ కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెడతామని తెలిపారు. మార్చి 14న ఆవిర్భావ దినోత్సవంలోపు సభ్యత్వ నమోదు పూర్తి చేస్తామన్నారు. కూటమిలో కష్టపడిన వారికి, త్యాగాలు చేసిన వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై చర్చించామని నాదెండ్ల తెలిపారు. వ్యక్తిగత వ్యవహారాలు పార్టీపైకి రాకుండా చూసుకోవాలన్నారు. కమిటీ రిపోర్టుని బట్టి చర్యలు ఉంటాయన్నారు. ఐష్యూస్ వచ్చినప్పుడు నేతలు మాట్లాడటం లేదని జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. పార్టీపై చేస్తున్న కామెంట్స్ ని ఎవరికి వారు ఖండించాలని పవన్ చెప్పారని వెల్లడించారు. సమాజంలో చీలిక తెచ్చేందుకు వైసీపీ అల్లర్లు సృష్టిస్తోందన్నారు. ఎవరైనా నోరు జారి మాట్లాడితే జవాబు చెప్పాల్సిందే అన్నారు.
Also Read: మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోంది, ఇక మీరెందుకు? జనసేన నేతలపై పవన్ కల్యాణ్ ఫుల్ సీరియస్
