Warren Buffett: అందరు వెనక్కు తగ్గుతున్న టైంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న ప్రపంచ కుబేరుడు బఫెట్

2022 మొదటి త్రైమాసికంలో ప్రముఖ కంపెనీలైన చెవ్రాన్, ఆక్సిడెంటల్ పెట్రోలియం మరియు HP Inc.లో బఫెట్ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు CNBC వార్తా సంస్థ తెలిపింది

Warren Buffett: అందరు వెనక్కు తగ్గుతున్న టైంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న ప్రపంచ కుబేరుడు బఫెట్

Buffet

Warren Buffett: ప్రపంచ అపరకుబేరుడు వారెన్ బఫెట్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచమంతా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని..స్టాక్ మార్కెట్ లో అస్థిరత నెలకొనగా..ఇన్వెస్టర్లు షేర్స్ కొనుగోలుపై వెనకడుగు వేస్తున్నారు. అయితే షేర్ మార్కెట్ మాంత్రికుడు, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన వారెన్ బఫెట్ మాత్రం..ఈ సమయంలోనే భారీగా షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. వారెన్ బఫెట్ కి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ‘బెర్క్‌షైర్ హాథవే’ 2022 మొదటి త్రైమాసికంలో అంటే జనవరి-మార్చి 2022 మధ్య భారీగా షేర్లు కొనుగోలు, ఇతర ఇన్వెస్టుమెంట్ చేసినట్లు సోమవారం వెల్లడించింది. వివిధ కంపెనీల స్టాక్‌ల కొనుగోలు నిమిత్తం ‘బెర్క్‌షైర్ హాథవే $51 బిలియన్లకు పైగా ఖర్చు చేసినట్లు సంస్థ ప్రకటించింది.

Other Stories:World Oldest Man: “బాగా పనిచేయండి, సెలవుల్లో రెస్ట్ తీసుకోండి, ఆల్కహాల్ తాగండి.. ఎక్కువ కాలం బతకండి”

2022 మొదటి త్రైమాసికంలో ప్రముఖ కంపెనీలైన చెవ్రాన్, ఆక్సిడెంటల్ పెట్రోలియం మరియు HP Inc.లో బఫెట్ భారీగా పెట్టుబడులు పెట్టినట్లు CNBC వార్తా సంస్థ తెలిపింది. అదే సమయంలో దాదాపు 4 మిలియన్ల Apple షేర్లను కూడా బఫెట్ కొనుగోలు చేశారు. ఈమేరకు ఈఏడాది జనవరి – మార్చి మధ్య యాపిల్ సంస్థ డివిడెండు ప్రకటించగా..అప్పటికే ఆ సంస్థ షేర్లు కలిగి ఉన్న బఫెట్..ఆయా షేర్లపై $208,738,745.03 (సుమారు ₹1617.23 కోట్లు) డాలర్ల భారీ డివిడెండు పొందగలిగారు.

Other Stories:Ratan TATA: నానో కారులో తాజ్ హోటల్‌కు వచ్చిన రతన్ టాటా

వారెన్ బఫెట్ ఇన్వెస్ట్ చేసిన సంస్థల్లో.. సిటీ గ్రూప్, అల్లీ ఫైనాన్షియల్, మీడియా కంపెనీ పారామౌంట్ గ్లోబల్, ఇన్సూరర్ మార్కెల్, రసాయన తయారీ సంస్థ సెలనీస్ కార్ప్. మరియు ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్ మెక్‌కెసన్ కార్ప్. వంటి సంస్థలు ఉన్నాయి. బఫెట్ ఇన్వెస్ట్మెంట్ అనంతరం సిటీ గ్రూప్ షేర్లు 7 శాతం మేర పెరిగినట్లు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC) తెలిపింది. మరోవైపు తీవ్ర నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న జనరల్ మోటార్స్ సంస్థలోనూ 2 మిలియన్ల షేర్లను అదనంగా కొనుగోలు చేశారు బఫెట్. దీంతో ఇప్పటికే ఈసంస్థలో బఫెట్ షేర్ల సంఖ్య 62 మిలియన్లకు చేరింది.