నరమేధం : జిహాదీ పేరుతో 15మంది ఊచకోత

పశ్చిమ ఆఫిక్రా దేశంలోని బుర్కినా ఫాసోలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. మతం పేరుతో నరమేధం సృష్టించారు. 15మంది పౌరులను ఊచకోత కోశారు. జిహాదీ పేరుతో ఓ గ్రామంపై

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 01:56 AM IST
నరమేధం : జిహాదీ పేరుతో 15మంది ఊచకోత

Updated On : October 29, 2019 / 1:56 AM IST

పశ్చిమ ఆఫిక్రా దేశంలోని బుర్కినా ఫాసోలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. మతం పేరుతో నరమేధం సృష్టించారు. 15మంది పౌరులను ఊచకోత కోశారు. జిహాదీ పేరుతో ఓ గ్రామంపై

పశ్చిమ ఆఫిక్రా దేశంలోని బుర్కినా ఫాసోలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. మతం పేరుతో నరమేధం సృష్టించారు. 15మంది పౌరులను ఊచకోత కోశారు. జిహాదీ పేరుతో ఓ గ్రామంపై టెర్రరిస్టులు ఆయుధాలతో దాడి చేశారు. దొరికిన వారిని దొరికినట్టు చంపేశారు. రక్తపుటేరులు పారించారు. కొందరు గ్రామస్తులను కిడ్నాప్ చేశారు.

జిహాదీ పేరుతో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడుతున్నారు. తరుచుగా దాడులకు తెబడుతున్నారు. తాజాగా ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు. భద్రతను పెంచిన భద్రతా బలగాలు.. స్థానికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫాసోలో పట్టు కోసం ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ఆధిపత్యం కోసం అమాయకులను చంపేస్తున్నారు.

”ఆదివారం ఉదయం 11 మృతదేహాలను గుర్తించాము. పోబ్ మెంగా రోడ్డులో డెడ్ బాడీలు కనిపించాయి. గ్రామస్తులను కిడ్నాప్ చేసి చంపేసినట్టు తెలుస్తోంది” అని భద్రతా బలగాలు తెలిపాయి.