Iphone Price : వామ్మో.. 2లక్షలు కానున్న ఐఫోన్ ధర? ఆపిల్ ఉత్పత్తులపై ట్రంప్ టారిఫ్‌ల దెబ్బ..

ఆపిల్ తయారీ సామర్థ్యంలో 80 శాతం చైనాదే. 55 శాతం మ్యాక్ ఉత్పత్తులు, 80 శాతం ఐప్యాడ్‌లు ఆ ఆసియా దేశంలోనే అసెంబుల్ చేయబడుతున్నాయి.

Iphone Price : మీరు లేటెస్ట్ ఐఫోన్ కొనాలని అనుకుంటున్నారా? అయితే, త్వరపడండి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదు. అవును ఐఫోన్ ధరలు భారీ పెరిగే అవకాశం ఉంది. ఐఫోన్ ధర 2 లక్షలు అయ్యే ఛాన్స్ ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త సుంకాల కారణంగా ఐఫోన్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆపిల్ అదనపు ఖర్చులను కస్టమర్లకు బదిలీ చేయాలని డిసైడ్ అయితే.. ఐఫోన్‌ ధర 30 నుండి 40శాతం వరకు పెరుగుతుందని నివేదికలు చెబుతున్నాయి.

ఆపిల్ ఐఫోన్లు ప్రధానంగా చైనాలో ఉత్పత్తి అవుతాయి. ట్రంప్ సుంకాల వల్ల చైనా తీవ్రంగా నష్టపోనుంది. సుంకాల ప్రభావం ఆపిల్‌ను క్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ టారిఫ్ ల భారాన్ని ఆపిల్ తనే భరిస్తుందా? లేక కస్టమర్లకు బదిలీ చేస్తుందా? అనే దానిపై ధరల పెంపు ఆధారపడి ఉంది.

ప్రస్తుతం ఐఫోన్ 16 మోడల్ ధర 68వేల రూపాయలుగా ఉంది. ఒక వేళ ఆపిల్ కనుక టారిఫ్ కాస్ట్ ను ధరకు జోడిస్తే..43శాతం వరకు పెంపు ఉంటుంది. అంటే, ఐఫోన్ ధర 97వేలకు పెరుగుతుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (6.9 ఇంచ్ స్క్రీన్, 1 టెరాబైట్ స్టోరేజ్) ధర దాదాపుగా 2 లక్షలు కావొచ్చని అంచనా. అమెరికా వ్యాపారాలు తమ తయారీని చైనా నుండి తరలించాలని ఒత్తిడి తీసుకురావడానికి అధ్యక్షుడు ట్రంప్ వివిధ రకాల చైనా దిగుమతులపై సుంకాలను విధించిన తర్వాత ఈ పెంపుదల వచ్చింది.

”చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై 54శాతం టారిఫ్ విధించాలన్న ట్రంప్ నిర్ణయం ఆపిల్ ను కష్టాల్లోకి నెట్టింది. ఆపిల్ పరికరాలు చాలావరకు చైనాలో తయారవుతాయి. దాంతో అదనపు సుంకాల ప్రభావం ఆపిల్ పై నేరుగా పడుతుంది. ఆ భారాన్ని ఆపిల్ ఎలా సర్దుబాటు చేస్తుంది అనేదానిపై ఆపిల్ ఉత్పత్తుల ధరలు ఆధారపడి ఉన్నాయి.

ఈ టారిఫ్ ల భారాన్ని ఆపిల్ తనే భరిస్తుందా? లేక కస్టమర్లకు బదిలీ చేస్తుందా? చూడాలి. అయితే, పూర్తి భారాన్ని ఆపిల్ తీసుకోదని, కస్టమర్లపై ఆ భారం కచ్చితంగా పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఆపిల్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి” అని మార్కెట్ నిపుణులు విశ్లేషించారు.

Also Read : డొనాల్డ్ ట్రంప్ భారత్ సహా ఏ దేశం ఉత్పత్తులపై ఎంతశాతం సుంకాలు విధించారంటే.. పూర్తి వివరాలు ఇలా..

ఆపిల్ గతంలో ప్రత్యేక మినహాయింపుల ద్వారా ధరల పెరుగుదలను పక్కదారి పట్టించగలిగినప్పటికీ, ఈసారి ఎటువంటి మినహాయింపులు ఇవ్వలేదు. ప్రధాన మార్కెట్లలో ఐఫోన్ అమ్మకాలు ఇప్పటికే మందగించడంతో, ధరల పెరుగుదల వల్ల కలిగే అదనపు ఆర్థిక ఒత్తిడి ఆపిల్‌కు పరిస్థితిని మరింత దిగజార్చవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ ఇంటెలిజెన్స్ అందించిన కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కొందరిని తగినంతగా ఆకర్షించకపోవడంతో వినియోగదారులు తాజా మోడళ్లను కొనుగోలు చేయడానికి తొందరపడటం లేదు.

ఆపిల్ కంపెనీ టారిఫ్‌ల మొత్తం భారాన్ని కస్టమర్లకు బదిలీ చేయాలని ఎంచుకుంటే, ఐఫోన్ అమ్మకాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ధరలు పెరగడం వల్ల వినియోగదారులు శామ్‌సంగ్ వంటి ఇతర ప్రత్యామ్నాయాలకు మారాల్సి రావచ్చు. శామ్‌సంగ్ ఫోన్‌లు చాలా వరకు చైనాయేతర దేశాల్లో ఉత్పత్తి అవుతున్నందున తక్కువ టారిఫ్‌ల నుండి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది.

ఆపిల్ తయారీ సామర్థ్యంలో 80 శాతం చైనాదే. 55 శాతం మ్యాక్ ఉత్పత్తులు, 80 శాతం ఐప్యాడ్‌లు ఆ ఆసియా దేశంలోనే అసెంబుల్ చేయబడుతున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో ఆపిల్ తన సరఫరా గొలుసును చైనా దాటి భారతదేశం, వియత్నాం వంటి దేశాలకు విస్తరించింది. రెండూ వరుసగా 26 శాతం, 46 శాతం అధిక దిగుమతి పన్నులను ఎదుర్కొంటున్నాయి.

ఆపిల్ కీలక తయారీ కేంద్రాలపై ట్రంప్ అధిక సుంకాలను విధించారు. దాంతో ఆపిల్ విక్రయించే ఐఫోన్, ఐప్యాడ్, మాక్ ఇతర వస్తువుల ప్రతి మోడల్‌ ధరలను ఇది ప్రభావితం చేస్తుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియాలో ఆపిల్ అతిపెద్ద ఉత్పత్తి సరఫరా కేంద్రాలు, చైనా, భారతదేశం, వియత్నాం వంటి వాటిపై “పరస్పర సుంకాలు” ప్రకటించారు. 54 శాతం సుంకంతో తీవ్రంగా దెబ్బతిన్న చైనా.. ఆపిల్ ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా విక్రయించే దాదాపు 200 మిలియన్ (20 కోట్ల) ఐఫోన్లలో 90 శాతం ఉత్పత్తి చేస్తుంది.

Also Read : దెబ్బకు దెబ్బ.. అమెరికా మీద చైనా టారిఫ్… ఇప్పుడు ఉన్నదానికంటే అదనంగా..

ఆపిల్ తన ఉత్పత్తుల్లో 90 శాతం చైనాలో తయారు చేస్తుంది. మిగిలిన 10 శాతం వియత్నాం, భారత్ వంటి ఇతర ఆసియా దేశాలలో తయారు చేస్తుంది. ఈ దేశాలు అత్యంత కఠినమైన సుంకాలను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఐఫోన్లు, ఆపిల్ వాచ్‌ల ధరలు పెరుగుతాయి. అదే సమయంలో కంపెనీ లాభాలను గణనీయంగా దెబ్బతీస్తుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఆపిల్ తన ఉత్పత్తిని అమెరికాకు మార్చడం అంత సులభం కాదు. అంతేకాదు అంత చౌకైనది కూడా కాదు.

ఆపిల్ కనుక అదనపు ఖర్చులను వినియోగదారులకు బదిలీ చేస్తే.. ఐఫోన్‌ల ఉత్పత్తుల ధరలు 30 నుంచి 40 శాతం పెరుగుదలను చూడొచ్చు. దిగుమతి సుంకాలను ఎదుర్కోవడానికి ఆపిల్ తన ఉత్పత్తుల ధరలను సగటున కనీసం 30 శాతం పెంచాల్సి ఉంటుంది. మార్కెట్ విశ్లేషకులు ఐఫోన్ల రేట్లు 43 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో.. ప్రస్తుతం 68వేల రూపాయలు ఖరీదు చేసే ఐఫోన్ 16 ధర 97 వేల రూపాయలు 200 కానుంది. ఇక ప్రస్తుతం లక్ష 36వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర ఒక లక్ష 95వేల 766 రూపాయలు కానుంది. ప్రస్తుతం అన్నింటికంటే చీఫ్ అయిన ఫోన్ ఐఫోన్ 16ఈ. ప్రస్తుతం 51వేలుగా ఉన్న దీని ధర 73వేల రూపాయలు కానుంది.