Al Qaeda Chief: జవహరీ హత్యకు అమెరికా రహస్య ఆయుధం?

ఆల్ ఖైదా చీఫ్ అయ్మన్ అల్ జవహరీ హత్యకు అమెరికా రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జవహరీ ఇంటిపై రెండు మిసైల్స్‭తో దాడి జరిగిప్పటికీ బయటికి మాత్రం పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇందు కోసం హెల్‭ఫైర్ ఆర్9ఎక్స్ అనే భయంకరమైన ఆయుధాన్ని అమెరికా ప్రయోగించినట్లు సమాచారం.

Al Qaeda Chief: ఆల్ ఖైదా చీఫ్ అయ్మన్ అల్ జవహరీ హత్యకు అమెరికా రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జవహరీ ఇంటిపై రెండు మిసైల్స్‭తో దాడి జరిగిప్పటికీ బయటికి మాత్రం పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ఇందు కోసం హెల్‭ఫైర్ ఆర్9ఎక్స్ అనే భయంకరమైన ఆయుధాన్ని అమెరికా ప్రయోగించినట్లు సమాచారం. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఎలాంటి పేలుడు లేకుండా లక్ష్యంవైపు దూసుకెళ్లి పని పూర్తి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఆయుధాన్ని అమెరికా 2017 మార్చిలో మొదటి సారి ప్రయోగించింది. ఆల్ ఖైదా సీనియర్ లీడర్ అబు అల్ ఖాయర్ అల్ మస్రీ.. సిరియాలో కారులో ప్రయాణిస్తుండగా డ్రోన్ ద్వారా హెల్‭ఫైర్ ఆర్9ఎక్స్‭ను ప్రయోగించింది.

అబు అల్‭పై ప్రయోగించినప్పుడు కారు రూఫ్‭పై పెద్ద రంద్రం కనిపించింది. కారు లోపల కొన్ని ఇంటీరియర్ పరికరాలు ధ్వంసమైనప్పటికీ కారు ముందు భాగం, వెనుక భాగం చెక్కచెదరకుండా ఉన్నట్లు అప్పట్లో ఫొటోల్లో కనిపించింది. ప్రస్తుతం జవహార్‭ ఇంటిపై జరిగిన దాడిలో కూడా అలాంటి పరిస్థితే కనిపించింది. రెండు మిసైల్స్ ప్రయోగం జరిగినప్పటికీ దాడి జరిగిన పరిసరాల్లో పేలుడు సంభవించలేదు. జవహరీ బాల్కనీలో ఉండగా యూఎస్ ఆర్మీ డ్రోన్ దాడి చేసి అతడిని హతమార్చిందని అమెరికాకు చెందిన ఒక ఉన్నత అధికారి జూలై 31న ప్రకటించారు. అయితే ఈ సమయంలో జవహరి కుటుంబ సభ్యులు ఇంట్లనే ఉన్నప్పటికీ వారెవరూ గాయపడలేదని ఆయన పేర్కొన్నారు.

కెన్యా, టాంజానియా దేశాల్లోని యూఎస్ రాయబార కార్యాలయాలపై దాడిలో జవహరీ కీలకపాత్ర పోషించాడని జో బిడెన్ చెప్పారు. జవహరీ అమెరికా జాతీయ భద్రతకు సవాలుగా మారడంతో అతన్ని హతమార్చామని, అతని హత్యతో అల్ ఖైదా ఉనికికి తీవ్ర విఘాతం కలుగుతుందని బిడెన్ చెప్పారు. జవహరీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతోపాటు ఇతను మరణించాడని పలు సంవత్సరాలుగా పుకార్లు వినిపించాయి. గత ఏడాది ఆగస్టులో తాలిబన్లు అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత జవహరీ కాబూల్ నగరంలో ఉన్నాడని సమాచారం. జవహరీ కాబూల్‭లో పాగా వేశాడని తాలిబన్లకు ముందే తెలుసని యూఎస్ పేర్కొంది. డ్రోన్ దాడిని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ధ్రువీకరించారు. అంతర్జాతీయ విధానాలకు యూఎస్ డ్రోన్ దాడి ఉల్లంఘన అని జబిహుల్లా చెప్పారు.

Har Ghar Tiranga: సోష‌ల్ మీడియా డీపీలు మార్చుకున్న మోదీ, కేంద్ర మంత్రులు

ట్రెండింగ్ వార్తలు