Har Ghar Tiranga: సోష‌ల్ మీడియా డీపీలు మార్చుకున్న మోదీ, కేంద్ర మంత్రులు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు సోషల్ మీడియా ఖాతాల‌ అన్నింటికీ త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకోవాలని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇటీవ‌లే సూచించారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ పిలుపునిచ్చారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి ఆగ‌స్టు 2న ఉంద‌ని గుర్తుచేశారు. ఈ నేప‌థ్యంలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నాన‌ని చెప్పారు. ఇవాళ ఉద‌యం ప్ర‌ధాని మోదీ సామాజిక మాధ్య‌మాల్లో త‌న డీపీగా జాతీయ జెండాను పెట్టుకున్నారు.

Har Ghar Tiranga: సోష‌ల్ మీడియా డీపీలు మార్చుకున్న మోదీ, కేంద్ర మంత్రులు

Har Ghar Tiranga: ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు సోషల్ మీడియా ఖాతాల‌ అన్నింటికీ త్రివర్ణ పతాకాన్ని డీపీగా పెట్టుకోవాలని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఇటీవ‌లే సూచించారు. మన్‌కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఈ పిలుపునిచ్చారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి ఆగ‌స్టు 2న ఉంద‌ని గుర్తుచేశారు. ఈ నేప‌థ్యంలో ఆయనకు నివాళులు అర్పిస్తున్నాన‌ని చెప్పారు. ఇవాళ ఉద‌యం ప్ర‌ధాని మోదీ సామాజిక మాధ్య‌మాల్లో త‌న డీపీగా జాతీయ జెండాను పెట్టుకున్నారు.

”నేడు ఆగ‌స్టు 2.. ఇది ప్ర‌త్యేక దినం. మ‌నం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ జ‌రుపుకుంటోన్న నేప‌థ్యంలో మ‌న దేశ‌మంతా హర్‌ఘ‌ర్ తిరంగాకు సిద్ధ‌మైంది. నేను నా సోష‌ల్ మీడియా ఖాతాల్లో నా డీపీని మార్చాను. మీరంద‌రు కూడా ఇదే పని చేయాల‌ని కోరుతున్నాను” అని మోదీ ఇవాళ‌ పేర్కొన్నారు. కాగా, ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఇళ్ళ‌పై ఆగస్టు 13 నుంచి 15 వరకు జాతీయ జెండాను ఎగరవేయాలని మోదీ ఇటీవ‌లే పిలుపునిచ్చారు. #IndianPost4Tiranga, #HarGharTirangan హ్యాష్‌టాగ్స్‌తో వాటి ఫొటోలు అప్‌లోడ్ చేయాల‌ని కోరారు.

మ‌రోవైపు, కేంద్ర మంత్రులు, బీజేపీ నేత‌లు కూడా జాతీయ జెండా ఫొటోను డీపీలుగా పెట్టుకున్నారు. ఈ సంద‌ర్భంగా అమిత్ షా ట్విట‌ర్‌లో స్పందిస్తూ… దేశ సమగ్రతకు, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయ‌న‌కు వందనాలు తెలుపుతున్నాన‌ని పేర్కొన్నారు.

China: చైనా నుంచి ముప్పు.. భారీ యుద్ధ విన్యాసాలు చేప‌ట్టిన తైవాన్