2022 Nobel Prize: సాహిత్యంతో నోబెల్ గెలుచుకున్న ఫ్రెంచ్ రచయిత అన్నీ ఎర్నాక్స్

1940లో నార్మాండీలోని యెవెటోట్‌ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్‌ పుట్టి పెరిగారు. అక్కడే తల్లిదండ్రులతో కలిసి ఓ దుకాణం, కేఫ్‌ను నడిపిన ఎర్నాక్స్‌.. రచయితగా సాగించిన ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది, కష్టమైనది. వాస్తవానికి నోబల్ పురస్కారం ఆమెకు వస్తుందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఆ ఊహాగాణాలు ఇప్పటికి నిజమయ్యాయి

2022 Nobel Prize: ఈ ఏడాది నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. ఇప్పటికే పలు విభాగాల్లో అవార్డులు ప్రకటించిన నోబెల్ ఎంపిక కమిటీ ఇవాళ సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది. ఫ్రెంచ్ రచయిత అన్నీ ఎర్నాక్స్(82) ఈ ఏడాది నోబెల్ సాహిత్య పురస్కారాన్ని దక్కించుకున్నారు. తన నవలల ద్వారా లింగం, వర్గం, భాషపై స్వీయ అనుభవాలతో విభిన్న కోణాల నుంచి విశ్లేషిస్తూ రచనలో చేయడంలో ఆమె సిద్ధహస్తురాలు. అన్నీ ఎర్నాక్స్ అంటేనే ఆ నవలలు గుర్తుకొస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆమెను ఎక్కువగా గుర్తించేది ఇలాంటి నవలల ద్వారానే. 30కి పైగా ఆమె సాహిత్య రచనలు ప్రచురితం అయ్యాయి.

‘ఫర్ ది కరేజ్ అండ్ క్లినికల్లీ ఏక్యుటీ’ అనే పేరుతో జ్ణాపకశక్తి మూలాలపై చేసిన రచనలకు గాను ఆమెకు నోబెల్ బహుమతి లభించింది. సాహిత్య రంగంలో అన్నీ ఎర్నాక్స్ చేసిన విశేష సేవలకు గాను ఈ పురస్కారం లభించినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన అనంతరమే స్వీడిష్ టెలివిజన్ ఆమెను ఇంటర్వ్యూ చేశారు. అనంతరం ఆమె స్పందిస్తూ ‘‘చాలా గౌరవనీయమైన బహుమతి, అత్యున్నతమైన బాధ్యత’’ అని పేర్కొన్నారు.

1940లో నార్మాండీలోని యెవెటోట్‌ అనే చిన్న పట్టణంలో ఎర్నాక్స్‌ పుట్టి పెరిగారు. అక్కడే తల్లిదండ్రులతో కలిసి ఓ దుకాణం, కేఫ్‌ను నడిపిన ఎర్నాక్స్‌.. రచయితగా సాగించిన ప్రయాణం ఎంత సుదీర్ఘమైనది, కష్టమైనది. వాస్తవానికి నోబల్ పురస్కారం ఆమెకు వస్తుందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఆ ఊహాగాణాలు ఇప్పటికి నిజమయ్యాయి. 1901 నుంచి ఇప్పటివరకు 119మందికి సాహిత్య నోబెల్‌ పురస్కారాలు ప్రదానం చేయగా ఈ జాబితాలో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుకు ఎంపికైన 17వ మహిళగా ఎర్నాక్స్‌ నిలిచారు.

Facebook: గుట్టుచప్పుడు కాకుండా 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మెటా

ట్రెండింగ్ వార్తలు