Facebook: గుట్టుచప్పుడు కాకుండా 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మెటా

ఒకానొక సమయంలో కంపెనీ ఒక్కో షేర్ విలువ 380 డాలర్లకు చేరుకుంది. అయితే గతేడాది ఇది 60 శాతం తగ్గింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేదికల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని మెటా సంస్థ అధినేత మార్క్ జూకర్ బర్గ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ వ్యూహాలు సరిగా పని చేయడం లేదని, అందుకు ఉద్యోగులందరూ బాధ్యత వహించాలని మెటా ఉద్యోగులతో జూకర్ బర్గ్ అన్నట్లు సమాచారం.

Facebook: గుట్టుచప్పుడు కాకుండా 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగించనున్న మెటా

12k Facebook employees may lose jobs amid quiet layoffs

Facebook: గుట్టుచప్పుడు కాకుండా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తం ఉద్యోగుల్లోని 15 శాతం అంటే సుమారు 12,000 మందిని తొలగించనున్నారట. సంస్థ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం.. సంస్థకు చెందిన సీనియర్ ఎక్స్‭క్యూటివ్స్ ప్రస్తుతం అదే పనిలో ఉన్నారని, తొందరలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.

కొద్ది వారాల్లో సంస్థలోని 15 శాతం మంది ఉద్యోగులు ఇంటికి వెళ్లనున్నట్లు సంస్థలోని ఉద్యోగులే చెబుతున్నారు. ‘‘వాస్తవానికి మీకు బయటికి కనిపించేది ఏంటంటే.. ఆ ఉద్యోగులు తమకు తాముగా మానేసినట్లు కనిపించినప్పటికీ.. నిజానికి వారు బలవంతంగా గెంటివేయబడ్డారు’’ అని ఒక ఉద్యోగి తెలిపారు. సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ హైరింగ్ ఫ్రీజ్‌ను ప్రకటించినప్పటి నుండి నెలల తరబడిగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ సాగుతోంది.

ఒకానొక సమయంలో కంపెనీ ఒక్కో షేర్ విలువ 380 డాలర్లకు చేరుకుంది. అయితే గతేడాది ఇది 60 శాతం తగ్గింది. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేదికల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని మెటా సంస్థ అధినేత మార్క్ జూకర్ బర్గ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ వ్యూహాలు సరిగా పని చేయడం లేదని, అందుకు ఉద్యోగులందరూ బాధ్యత వహించాలని మెటా ఉద్యోగులతో జూకర్ బర్గ్ అన్నట్లు సమాచారం.

Airtel 5G Plans Price : ఎయిర్‌టెల్ 5G ప్లాన్ల ధరలు ఎంత ఉండొచ్చు.. 4G ప్లాన్ల మాదిరిగానే ఉంటాయా? అప్పటివరకూ ఆగాల్సిందేనా?