Airtel 5G Plans Price : ఎయిర్‌టెల్ 5G ప్లాన్ల ధరలు ఎంత ఉండొచ్చు.. 4G ప్లాన్ల మాదిరిగానే ఉంటాయా? అప్పటివరకూ ఆగాల్సిందేనా?

Airtel 5G Plans Price : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ 5G (Airtel 5G) సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే ముందుగా 8 భారతీయ నగరాల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఎయిర్ టెల్ సర్వీసులకు సంబంధించి టారిఫ్‌లు ఎంత ఉంటాయనేది కంపెనీ రివీల్ చేయలేదు.

Airtel 5G Plans Price : ఎయిర్‌టెల్ 5G ప్లాన్ల ధరలు ఎంత ఉండొచ్చు.. 4G ప్లాన్ల మాదిరిగానే ఉంటాయా? అప్పటివరకూ ఆగాల్సిందేనా?

Airtel 5G plans price to be announced soon, could be priced similar to its 4G plans

Airtel 5G Plans Price : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ 5G (Airtel 5G) సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే ముందుగా 8 భారతీయ నగరాల్లో అందుబాటులోకి రానుంది. అయితే ఎయిర్ టెల్ సర్వీసులకు సంబంధించి టారిఫ్‌లు ఎంత ఉంటాయనేది కంపెనీ రివీల్ చేయలేదు. కంపెనీ ఇంకా 5G ప్లాన్‌లను ఖరారు చేయనున్నట్టు తెలుస్తోంది.

రాబోయే కొద్ది రోజుల్లో ఎయిర్ టెల్ 5G సర్వీసులను రిలీజ్ చేస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. ఎయిర్‌టెల్ 4G ప్లాన్‌లతో పోలిస్తే.. Airtel 5G చాలా ఖరీదైనది కాదని నివేదించింది. అయినప్పటికీ కంపెనీ కొన్ని మార్పులు ఉండొచ్చునని తెలిపింది. Airtel అతిపెద్ద దేశీయ పోటీదారు అయిన రిలయన్స్ జియో (Reliance Jio), భారత మార్కెట్లో 5G ధరలను అత్యంత సరసమైన ధరకే అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అది ఎంతవరకు సాధ్యమనేది రాబోయే రోజుల్లో చూడాల్సిందే.

ఎయిర్‌టెల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఒకరు మాట్లాడుతూ.. 5G ఫోన్‌లలో తక్కువ సబ్‌స్క్రైబర్ బేస్ కారణంగా ఈ దశలో అధిక 5G టారిఫ్‌లు యూజర్లకు సగటు ఆదాయాన్ని (ARPU) పెంచలేవని గుర్తించాలి. అధిక టారిఫ్‌ల కారణంగా 5G సర్వీసులు తక్కువగా ఉన్న థాయ్‌లాండ్ గురించి కూడా మాట్లాడారు. చిన్న 5G ఫోన్ యూజర్ బేస్, అధిక టారిఫ్‌లు, తక్కువ వినియోగ కేసుల కారణంగా థాయిలాండ్‌లో 5G సర్వీసులకు సమయం పడుతుందని థాయ్ ఎన్‌క్వైరర్ పేర్కొంది. టెలికం పరిశ్రమకు పెట్టుబడిపై రాబడి 7 శాతం ఉంది. అది పెరగాల్సి ఉందని ARPU ద్వారా మాత్రమే వస్తుందని తెలిపింది. 5G నెట్‌వర్క్‌లో ధర మారదని గుర్తించాలి.

Airtel 5G plans price to be announced soon, could be priced similar to its 4G plans

Airtel 5G plans price to be announced soon, could be priced similar to its 4G plans

ARPU మొత్తం టారిఫ్ పెంపు ద్వారా జరగాల్సి ఉంటుంది. Jio భారత్‌లో 4Gని ప్రారంభమైనప్పుడు Airtel, Vodafone వంటి పోటీదారులు అన్‌లిమిటెడ్ డేటా, కాలింగ్ వంటి బెనిఫిట్స్ అందిస్తోంది. ఈ మోడల్ కొన్ని ఏళ్ల పాటు అలానే కొనసాగింది. గత ఏడాది డిసెంబర్‌లో అన్ని మొబైల్ ఆపరేటర్లు ARPUని పెంచే క్రమంలో తమ 4G ప్లాన్‌ల ధరలను సమానంగా పెంచారు.

త్వరలో మరో పెంపుదల ఉండొచ్చని పలువురు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జియో 5G సర్వీసులను కూడా ప్రయోగాత్మకంగా నాలుగు నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్‌టెల్, జియో రెండూ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రధాన సర్కిల్‌లను కవర్ చేయాలని భావిస్తున్నాయి. మరోవైపు, Vi ఇంకా 5G సర్వీసులకు సంబంధించి వివరాలను వెల్లడించలేదు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Airtel to Vi 5G Services : భారత్‌కు 5G వచ్చేసిందిగా.. ఏయే నగరాల్లో ఫస్ట్ 5G సర్వీసులు? ప్లాన్ల ధరలు ఎంత ఉండొచ్చు? పూర్తి వివరాలు మీకోసం..!