Fire Accident In Gaza: గాజాలో ఘోర అగ్నిప్రమాదం.. 8మంది చిన్నారులు సహా 21మంది మృతి..

పాలస్తీనాలోని గాజా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా క్యాంప్‌లో ఓ నివాస భవనంలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ఎనిమిది మంది చిన్నారులతో సహా 21 మంది మరణించారు. పలువురికి గాయాలుకాగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు.

Gaza Fire Accident

Fire Accident In Gaza: పాలస్తీనాలోని గాజా నగరంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని జబాలియా క్యాంప్‌లో ఓ నివాస భవనంలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో  ఎనిమిది మంది చిన్నారులతో సహా 21 మంది మరణించారు. పలువురికి తీవ్రగాయాలుకాగా వారిని చికిత్సనిమిత్తం బీట్ లాహియాలోని ఇండోనేషియా పబ్లిక్ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. చికిత్స పొందుతున్నవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Gaza Fire Accident

గాజాలో అత్యధిక జనాసాంధ్రత ఉండే జబాలియా శరణార్థుల క్యాంపు ప్రాంతంలోని నాలుగంతస్తుల అపార్ట్‌మెంట్‌లో ఈ మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు. మొదట చివరి అంతస్తులో మంటలు అంటుకున్నాయని, క్రమంగా అవి బిల్డింగ్‌ మొత్తానికి వ్యాప్తి చెందాయని వెల్లడించారు. మృతుల్లో అత్యధికులు ఒకే కుటుంబానికి చెందినవారని పాలస్తీనా అధికారులు పేర్కొంటున్నారు. విదేశాల నుంచి కుటుంబ సభ్యుడు తిరిగి గాజాకు వచ్చిన సందర్భంగా అందరూ ఒకేచోట చేరి సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా తెలిసింది. ప్రమాదానికి గురైన ఇంట్లో.. అనేక లీటర్ల ఇంధనాన్ని నిల్వ ఉంచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొవ్వొత్తులు వెలిగించగా అగ్నిప్రమాదానికి దారితీసినట్ల అధికారులు భావిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం కారణాలు వెల్లడిస్తామని తెలిపారు.

Gaza Fire Accident

మంటలను అదుపుచేయడానికి చాలా సమయం శ్రమించాల్సి వచ్చిందని రెస్క్యూ సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాద ఘటనపై పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఈ ఘోర ఘటన నేపథ్యంలో శుక్రవారం సంతాప దినంగా ప్రకటించారు. క్షతగాత్రుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.