Hostages Released : యుద్ధం ప్రారంభమై రెండునెలల తర్వాత 24 మంది బందీలను విడుదల చేసిన హమాస్

గాజా-ఇజ్రాయెల్ యుధ్ధం ప్రారంభం అయ్యాక రెండు నెలల తర్వాత ఎట్టకేలకు 24మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ దేశంతో కుదిరిన సంధితో హమాస్ 24 మంది బందీలను శనివారం విడుదల చేసింది.....

Hostages Released

Hostages Released : గాజా-ఇజ్రాయెల్ యుధ్ధం ప్రారంభం అయ్యాక రెండు నెలల తర్వాత ఎట్టకేలకు 24మంది బందీలను హమాస్ విడుదల చేసింది. ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ దేశంతో కుదిరిన సంధితో హమాస్ 24 మంది బందీలను శనివారం విడుదల చేసింది. ఇజ్రాయెల్ యుద్ధం తర్వాత గాజా పూర్తిగా విధ్వంసం అయింది. 13 మంది ఇజ్రాయెలీ బందీలు తిరిగి ఇజ్రాయెల్ భూభాగానికి చేరుకున్నారు. బందీలు వారి కుటుంబసభ్యులతో తిరిగి కలిసే ముందు వైద్య పరీక్షలు చేయించుకుంటారని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.

ALSO READ : No non veg day : మాంస రహిత దినోత్సవం నేడు…ప్రభుత్వ అధికారిక ప్రకటన ఎందుకంటే…

ఇజ్రాయెల్ చేరిన బందీల్లో నలుగురు పిల్లలు, ఆరుగురు వృద్ధ మహిళలు ఉన్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం విడుదల చేసిన జాబితా వెల్లడించింది. హమాస్ బందీలను మానవతా సంస్థకు అప్పగించిన తర్వాత వారిని రెడ్‌క్రాస్ వాహనాల కాన్వాయ్ తో గాజా, ఈజిప్ట్ మధ్య సరిహద్దును దాటుతుండగా కొంతమంది ప్రయాణీకులు చేతులు ఊపుతూ కనిపించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూపులు, ఖతార్, ఈజిప్ట్, యునైటెడ్ స్టేట్స్ పాల్గొన్న చర్చల తరువాత జరిగిన ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ మూడు రెట్లు ఎక్కువ మంది పాలస్తీనా ఖైదీలు, మహిళలు, యుక్తవయస్సులోని అబ్బాయిలను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

Hostages Released

ALSO READ : Telangana Polls: ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. రైతుబంధు పంపిణీకి గ్రీన్ సిగ్నల్

హమాస్ శుక్రవారం 24 మంది బందీలను విడుదల చేసిందని, ఇజ్రాయెల్ 39 మంది మహిళలు, పిల్లలను తన జైళ్ల నుంచి విడిపించిందని కీలక మధ్యవర్తి ఖతార్ ధృవీకరించింది. హమాస్ విడుదల చేసిన బందీల్లో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు ఉన్నారు. వీరిలో కొందరు ద్వంద్వ పౌరులు. 10 మంది థాయ్ పౌరులు, ఫిలిప్ఫీన్స్ పౌరులు ఉన్నారని దాని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మజేద్ అల్ అన్సారీ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక, ఫిరంగి , నావికాదళ దాడులతో పాటు భూదాడిలో గాజాలో 15,000 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది పౌరులని గాజాలోని హమాస్ ప్రభుత్వం తెలిపింది.

ALSO READ : Caste Census : ఏపీలో కులగణనకు ముహూర్తం ఫిక్స్, ఎప్పటి నుంచి అంటే

గాజాలో నిత్యావసర సరుకుల కొరతతో అల్లాడుతున్నారు. సంధి ప్రారంభమైన కొద్దిసేపటికే ఈజిప్ట్ నుంచి రాఫా క్రాసింగ్ ద్వారా ఇంధనం, గ్యాస్, ఆహారంతో సహా ట్రక్కులు గాజాలోకి వెళ్లడం ప్రారంభించాయి. గాజాలో వేలాది మంది ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. దీంతో వీధులు రద్దీగా కనిపించాయి. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ప్రజలను హెచ్చరించే కరపత్రాలను జారవిడిచాయి.

ట్రెండింగ్ వార్తలు