Caste Census : ఏపీలో కులగణనకు ముహూర్తం ఫిక్స్, ఎప్పటి నుంచి అంటే

AP Caste Census : సమగ్ర కులగణన పేదవాడి జీవితానికి భద్రత అని.. ప్రజల జీవనస్థితి మారడానికి కులగణన అవసరం అని మంత్రి వేణు అన్నారు.

Caste Census : ఏపీలో కులగణనకు ముహూర్తం ఫిక్స్, ఎప్పటి నుంచి అంటే

AP Caste Census (Photo : Google)

ఏపీలో కులగణనకు సంబంధించి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కీలక ప్రకటన చేశారు. ఏపీలో డిసెంబర్ 9 నుండి కులగణన ప్రక్రియ మొదలవుతుందని మంత్రి తెలిపారు. సమగ్ర కులగణన చేయడమే జగన్ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. సమగ్ర కులగణన పేదవాడి జీవితానికి భద్రత అని పేర్కొన్నారు. ప్రజల జీవనస్థితి మారడానికి కులగణన అవసరం అని మంత్రి వేణు వ్యాఖ్యానించారు.

Also Read : కేంద్రం ఇచ్చిన ఆ కోట్ల రూపాయలు ఏమయ్యాయి? సీఎం జగన్‌ను ప్రశ్నించిన పురంధేశ్వరి

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదని ఆయన తెలిపారు. సామాజిక సాధికారితకు చిరునామా ముఖ్యమంత్రి జగన్ అని చెప్పారు. కులగణన కోసం కుల సంఘాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరిగే కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మంత్రి వేణు అన్నారు. సమగ్ర కులగణన సామాజిక కోణంలో జరుగుతుందన్నారు. కులగణన అనగానే ప్రతిపక్షాల వెన్నులో వణుకు పుడుతోందన్నారు.