Afghanistan Earthquake : అఫ్ఘానిస్తాన్ లో భారీ భూకంపం.. 26 మంది మృతి

పశ్చిమ అఫ్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులతో సహా 25మంది మృతి చెందారు.

Afghanistan Earthquake..26 Dead : పశ్చిమ అఫ్ఘానిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో కనీసం 25మంది మృతి చెందారని అధికారులు తెలిపారు. పశ్చిమ ఆఫ్గాన్‌లో సంభవించిన వరుస భూకంపాలు భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఎంతోమందిని దిక్కులేనివారిని చేస్తోంది. పశ్చిమ అఫ్గాన్‌లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం (జనవరి 17,2022) రాత్రి కేవలం నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూకంపం సంభవించింది. పశ్చిమ ప్రావిన్స్ బాద్గీస్‌లోని ఖదీస్ జిల్లాలో పలు ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో బాధితులు మరణించారని బాజ్ మహ్మద్ సర్వారీ అనే అధికారి తెలిపారు.

Also read : Corona Treatment: కరోనా రోగుల చికిత్సకు మార్గదర్శకాలను సవరించిన కేంద్ర ఆరోగ్యశాఖ

బాద్గీస్‌ పశ్చిమ ప్రావిన్సులోని ఖాదీస్ జిల్లాలో ఇళ్ల పైకప్పులు మీద పడటంతో 26 మంది మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు కూడాఉన్నారు.ఈ విపత్తులో చాలామంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైందైనట్టు యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. ప్రావిన్స్‌లోని ముఖ్ర్ జిల్లాలో కూడా భూకంపం సంభవించిందని అయితే అక్కడ జరిగిన ప్రాణ..ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని సర్వారీ వివరించారు.

Also read : Hyderabad Crime: పాతబస్తీలో దారి కాచి యువకుడిపై కత్తులతో దాడి

అఫ్ఘానిస్తాన్‌ ఇప్పటికే మానవతా విపత్తులో చిక్కుకుంది.తాలిబన్లు 2021 ఆగస్టులో స్వాధీనం చేసుకున్నాక మరింత సంక్షోభంలో కూరుకుపోవటానికి తోడు ఈ ప్రకృతి విపత్తులు కూడా తోడు కావటంతో దేశ ప్రజలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా..గత 20 సంవత్సరాలలో అంతర్జాతీయ సహాయం నుండి తక్కువ ప్రయోజనం పొందుతున్న కరువు వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో ఖాదీస్ ఒకటి.

 

 

ట్రెండింగ్ వార్తలు