World’s Biggest Snake : ప్రపంచంలోనే అతిపెద్ద అనకొండ ఎలా ఉందో చూశారా?.. 26 అడుగుల పొడవు, 200 కిలోల బరువు.. వీడియో

World's Biggest Snake : అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్‌లో భారీ అనకొండను కనుగొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా సైంటిస్టులు చెబుతున్నారు. నేషనల్ జియోగ్రాఫిక్స్ డిస్నీప్లస్ సిరీస్ సాహస యాత్ర సమయంలో ఈ జాతి పామును గుర్తించారు.

World’s Biggest Snake : అమెజాన్ రెయిన్‌ఫారెస్ట్ నడిబొడ్డున ప్రపంచంలోనే అతిపెద్ద పామును సైంటిస్టులు కనుగొన్నారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా అతిపెద్ద అనకొండను గుర్తించారు. ఇటీవల టీవీ వైల్డ్ లైఫ్ ప్రెజెంటర్ ప్రొఫెసర్ ఫ్రీక్ వోంక్ నేషనల్ జియోగ్రాఫిక్ యాత్రలో ఈ అనకొండను కనుగొన్నారు.

Read Also : Trending Video: నోరు తిరగక ఇబ్బంది పడిన సౌతాఫ్రికా క్రికెటర్లు

ఈ భారీ అనకొండ 26 అడుగుల పొడవు, 440 పౌండ్ల బరువు ఉంది. ఈ పాము తల మనిషి తల సైజులో ఉంటుందని ఆయన తెలిపారు. ఈ పాము జాతి ప్రపంచంలోనే అతి పెద్దదని, చాలా బరువైన పాముగా పేర్కొన్నారు. విల్ స్మిత్‌తో నేషనల్ జియోగ్రాఫిక్స్ డిస్నీ ప్లస్ సిరీస్ ‘ పోల్ టు పోల్’ సాహస యాత్ర సమయంలో ఈ జాతి పామును గుర్తించారు. ఈ కొత్త జాతి పాముకు లాటిన్ పేరు ‘యునెక్టెస్ అకాయిమా’ అని పరిశోధకులు పెట్టారు. అంటే.. ఉత్తర ఆకుపచ్చ అనకొండ అని అర్థం.

ఈ భారీ అనకొండకు సంబంధించిన వీడియోను ప్రొఫెసర్ వోంక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఎలాంటి భయం లేకుండా అతిపెద్ద అనకొండను పట్టుకుని కనిపించాడు. ‘నేను చూసిన అతి పెద్ద అనకొండ ఇదే.. కారు టైర్ అంత మందంగా ఉంది. 8 మీటర్ల (26 అడుగులు) పొడవుతో 200 కిలోల బరువుతో నా తల అంత పెద్ద తలతో వీడియోలో కనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. ఇదో అతిపెద్ద రాక్షస అనకొండ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. ఈ అనకొండలు తరచుగా ఆహారం కోసం అత్యంత వేగంగా కదులుతాయి. ఈ పాముల బలమైన శరీరాలను ఊపిరి పీల్చుకోవడానికి వాటిని పూర్తిగా మింగడానికి ఉపయోగిస్తాయి.

గతంలో, అమెజాన్ కేవలం ఒక జాతి ఆకుపచ్చ అనకొండను మాత్రమే కలిగి ఉందని భావించారు. దీనిని జెయింట్ అనకొండ అని కూడా పిలుస్తారు. అయితే, ఇదే అమెజాన్ ఫారెస్టులో అతని బృందం తొమ్మిది దేశాలకు చెందిన 14 మంది ఇతర శాస్త్రవేత్తలతో కలిసి అన్వేషించగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్తర ఆకుపచ్చ అనకొండ కూడా ఉందని నిర్ధారించారు.

జర్నల్ డైవర్సిటీలో వివరించిన కొత్త జాతుల్లో సుమారు 10 మిలియన్ సంవత్సరాల క్రితం గతంలో దక్షిణ ఆకుపచ్చ అనకొండను గుర్తించారు. అయితే, దానికి ఉత్తర ఆకుపచ్చ అనకొండ జాతి చాలా భిన్నంగా ఉంది. జన్యుపరంగా రెండింటి మధ్య 5.5 శాతం తేడా ఉందని పరిశోధకులు తెలిపారు.

Read Also : Snake Bite : పాము కాటుకు ఒంటె కన్నీరు విరుగుడు అట.. నిజమే

ట్రెండింగ్ వార్తలు