Snake Bite : పాము కాటుకు ఒంటె కన్నీరు విరుగుడు అట.. నిజమే

పాము కాటుకి విరుగుడు కనిపెట్టడం కోసం ఇప్పటికే పలు దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. తాజా పరిశోధనల్లో పాము కాటుకి విరుగుడు కనిపెట్టారట. ఏంటది?

Snake Bite : పాము కాటుకు ఒంటె కన్నీరు విరుగుడు అట.. నిజమే

Snake Bite

Snake Bite : పాము కాటుకి ఒంటె కన్నీరు విరుగుడు అట..విచిత్రంగా ఉందని ఆశ్చర్యపోతున్నారా? నిజమే. ఒంటె కన్నీటులో ఉండే రసాయనాలు పాము విషానికి విరుగుడుగా పనిచేస్తాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.

Garden of snakes : తోటలో చెట్ల నిండా పాములే.. ఆ స్నేక్ గార్డెన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

పామును చూస్తేనే భయపడతారు. అలాంటిది పాము కాటు వేస్తే ప్రాణాలు నిలబడతాయా? అని చాలామందిలో అపోహ ఉంటుంది. పాముల్లో ప్రమాదం కలిగించని పాములు.. ప్రాణాంతకమైన పాములు ఉంటాయి. ఏది ఏమైనా పాము కాటు వేయగానే వెంటనే చికిత్స మాత్రం అవసరం. త్రాచు పాము, కట్ల పాము వంటి పాము జాతలతోనే 15 శాతం ప్రమాదం ఉంటుందట. పాము విషం కన్నా కూడా షాక్‌తోనే ప్రాణాలో కోల్పోయే వారు ఉంటారట.

పాము కాటు వేయగానే ఆ ప్రాంతంలో గాయమై నొప్పి ఉంటుంది. నొప్పి తిమ్మిరిగా మారి నాలుక మందమై కండరాలు బిగుసుకున్నట్లు అవుతుందట. ఆ తర్వాత స్పృహ కోల్పోయే పరిస్థితులు ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితికి రాక ముందే త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్తే విషం విరుగుడు ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చును. అయితే ఏటా ఈ పాము కాటు వల్ల 1.25 లక్షల మంది చనిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇక పాము కాటు వల్ల మనిషి చనిపోయే పరిస్థితులు రాకుండా విరుగుడు మందు తయారీ కోసం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.

Viral Video: విమానంలో పాము.. వణికిపోయిన ప్రయాణికులు.. వీడియో

దుబాయ్‌లోని సీవీఆర్ఎల్ (సెంట్రల్ వెటర్నరీ లాబోరేటరీ) ఒక కొత్త విషయాన్ని వెల్లడించింది. ఒంటె కన్నీరుని ఉపయోగించి పాము కాటుకు విరుగుడు తయారు చేయవచ్చని తన పరిశోధనలో వెల్లడించింది. ఈ పరిశోధనను మరింత ముందుకు తీసుకువెళ్లే పనిలో ఉంది సీవీఆర్ఎల్. ఈ విషయాన్ని సీవీఆర్ఎల్ అధినేత డాక్టర్ వార్నర్ తెలిపారు. ఒంటె కన్నీటిలో ఉండే ప్రొటీన్లు ఇన్ఫెక్షన్స్ నుండి మనుషుల్ని కాపాడతాయట. ఇప్పటికే దీనిపై అనేక దేశాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఒంటె మూత్రం కూడా ఔషధాలు కలిగి ఉందని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. వీరి పరిశోధనలు ఫలించి ఔషధాన్ని కనిపెడితే పాము కాటు మరణాలు అరికట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.