Garden of snakes : తోటలో చెట్ల నిండా పాములే.. ఆ స్నేక్ గార్డెన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

అనగనగా ఒక తోట.. ఆ తోటలో అడుగుపెడితే పాములు.. చెట్ల నిండా పాములు.. కథ కాదు.. నిజం..12 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఆ తోట చూడటానికి పర్యాటకులు క్యూ కడతారట. ఈ స్నేక్ గార్డెన్ ప్రత్యేకత తెలుసుకోవాలని ఉందా?

Garden of snakes :  తోటలో చెట్ల నిండా పాములే.. ఆ స్నేక్ గార్డెన్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

Garden of snakes

Garden of snakes : ఆమడ దూరంలో పాము కనిపిస్తే పరుగులు తీస్తాం. ఆ గార్డెన్‌లో ఏ చెట్టు చూసినా పాములు.. అడుగు వేస్తే పాములు. 12 హెక్టార్ల విస్తీర్ణంలో పాముల తోటగా పిలవబడుతున్న ఆ భయానకమైన స్నేక్ గార్డెన్ ఎక్కడ ఉందో తెలుసా?

Nizamabad : బైక్ స్టార్టవ్వట్లేదని మెకానిక్‌కి చూపించాడు.. బయటకు వచ్చిన నాగుపాముని చూసి షాకయ్యాడు

రైతులు రకరకాల పండ్లు, కూరగాయల తోటలు పెంచుతారు. పాముల తోటను పెంచడం విన్నారా? షాకవుతున్నారు కదా. వియత్నాంలో ఉండే ‘డాంగ్ టామ్ స్నేక్ ఫామ్’‌కి చాలా ప్రత్యేకత ఉంది. 12 హెక్టార్లలో ఉన్న ఈ తోటలో అడుగు తీసి అడుగు వేస్తే పాములు ఉంటాయి. ఏ చెట్టుని చూసిన పాములే.. కొమ్మల నిండా పాములే. ఇక్కడ పాముల పెంపకంతో పాటు ఔషధ మొక్కలు కూడా పెంచుతారు. నాలుగు వందల కంటే ఎక్కువ విషపూరితమైన పాములు ఇక్కడ కనిపిస్తాయట. వీటి నుంచి సేకరించిన విషయంతో పాము కాటుకు విరుగుడు మందును తయారు చేస్తారట.

 

ఒకప్పుడు పరిశోధనల కేంద్రంగా ఉన్న ఈ తోట కాస్త.. ఇప్పుడు పర్యాటక కేంద్రంగా మారిందిట. ప్రతి ఏటా మిలియన్ల సంఖ్యలో పర్యాటకులు ఈ డాంగ్ టామ్ స్నేక్ ఫామ్‌ను సందర్శిస్తారట. ఇక్కడికి వచ్చేవారికి అన్ని వసతి సౌకర్యాలు ఉంటాయట. ఇప్పటి వరకూ 1500 మందికి పైగా పాముకాటుకి గురైన వారు ఈ గార్డెన్‌లో ఏటా చికిత్స పొందుతున్నారట.

Snakes Found: పిల్లలకు తప్పిన ప్రమాదం.. డ్రెస్సింగ్ టేబుల్ కింద 24 నాగు పాములు, 60 గుడ్లు.. స్థానికులు ఏం చేశారంటే?

kohtshoww అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ పాముల తోటకి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన అనేకమంది ఆశ్చర్యపోతున్నారు. పాముల పెంపకం, పరిశోధనలు, పాముకాటుకి విరుగుడుమందుల తయారీలో ఈ పొలం నిర్వాహకులు చేస్తున్న కృషిని అందరూ అభినందిస్తున్నారు.