ముంబై 26/11 బాంబు పేలుళ్ల సూత్రధారి జమాత్ ఉద్ దావా చీఫ్ (JuD) హఫీజ్ సయీద్ బామర్ది అరెస్ట్ అయ్యాడు.
ఇస్లామాబాద్ : ముంబై 26/11 బాంబు పేలుళ్ల సూత్రధారి జమాత్ ఉద్ దవా చీఫ్ (JuD) హఫీజ్ సయీద్ బావమరిది అరెస్ట్ అయ్యాడు. పాకిస్థాన్ లో బుధవారం (మే 15, 2019) అబ్దుల్ రహమాన్ మక్కిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వాన్ని విమర్శించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించినందుకుగానూ మక్కిని పాక్ అరెస్ట్ చేసినట్టు అంతర్గత మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
జేయుడీ పొలిటికల్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ విభాగం అధ్యక్షుడిగానూ, ఛారిటీ ఫలా-ఈ-ఇన్సానియాత్ ఫౌండేషన్ (FIF) ఇంఛార్జ్ గా అబ్దుల్ రహమాన్ వ్యవహరిస్తున్నాడు. మెయింట్ నెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ యాక్ట్ కింద మక్కిని అరెస్ట్ చేసినట్టు పంజాబ్ పోలీసులు తెలిపారు. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) మార్గదర్శకాల ప్రకారం.. పాక్ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై అబ్దుల్ మక్కి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడంతో అతన్ని అరెస్ట్ చేశారు.
ఇప్పటికే యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ ద ట్రెజరీ.. మాస్టర్ మైండ్ సయీద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించింది. కానీ, 2012 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన సయీద్ గురించి సమాచారాన్ని ఇచ్చినవారికి యూఎస్ డీ 10 మిలియన్ల రివార్డును ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలోనే పాకిస్థాన్ ప్రభుత్వం FIF, JuD ఉగ్రవాద సంస్థలను బ్యాన్ చేసింది. ఈ సంస్థలతో సంబంధం ఉన్న 11 సంస్థలపై కూడా పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది.