రిషికేష్ లో పోర్న్ వీడియో షూటింగ్…..అమెరికన్ మహిళ అరెస్ట్

  • Published By: murthy ,Published On : October 20, 2020 / 04:34 PM IST
రిషికేష్ లో పోర్న్ వీడియో షూటింగ్…..అమెరికన్ మహిళ అరెస్ట్

Updated On : October 20, 2020 / 5:12 PM IST

American woman held for shooting obscene video : ఉత్తరా ఖండ్ లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన రిషికేష్ లో గంగానదిపై నిర్నించిన లక్ష్మణ్ ఝూలా వంతెనపై ఆశ్లీల వీడియో చిత్రీకరించిన అమెరికన్ (27) మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితురాలు లక్ష్మణ్ ఝూలా వంతెనపై ఆశ్లీల వీడియోను చిత్రీకరించి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు మునికిరెటి పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ ఆర్.కె.సక్లాని చెప్పారు.

అమెరికా మహిళను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా ఆమెకు రూ.2,000 జరిమానా విధించిన అనంతరం విడుదల చేశారు. కాగా….రెండు నెలల క్రితం ఆగస్టులో ఇదే వంతెనపై  ఆశ్లీలంగా  ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన ప్రెంచ్ మహిళ, ఆమెకు సహకరించిన అమెరికన్ పౌరుడ్ని కూడా పోలీసులు అరెస్టు చేసారు.


ఆ ఘటన మరువక ముందే మరో విదేశీ మహిళ ఈ విధంగా చేయటం చర్చనీయాంశం అయ్యింది. ఆగస్టులో లాక్ డౌన్ సమయంలో తన పూసల దండల వ్యాపారానికి సహకరించమని కోరుతూ ఫ్రెంచ్ మహిళ అమెరికన్ పౌరుడితో కలిసి ఆశ్లీల ఫోటోలు దిగింది. తన వ్యాపార అభివృధ్ది కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందని పోలీసులు తెలిపారు.ప్రెంచ్ మహిళపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.