కెనడాలోని నోవా స్కోటియాలోని హాలిఫాక్స్ ప్రాంతంలో ఉన్న ఒక చారిత్రాత్మక హోటల్‌ను సబ్బు బిళ్లల సహాయంతో తరలించారు. వాస్తవానికి ఈ హోటల్‌ను కూల్చివేయాల్సి ఉంది, కానీ ఒక ఉపాయంతో ఈ చారిత్రక హోటల్ కూల్చివేత నుంచి రక్షించబడడమే కాకుండా కొత్త ప్రదేశానికి మార్చేశారు. కెనడీ మీడియా ప్రకారం.. ఎల్మ్‌వుడ్ హోటల్ విక్టోరియన్ కాలం నాటి భవనం. 1826 సంవత్సరంలో నిర్మించిన ఈ భవనం తరువాత ఎల్మ్‌వుడ్ హోటల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థి సీఎం ఎలా అవుతారు? రాజ్యాంగంలోని ఈ విషయం ఏం చెప్తుందంటే?
2018లో ఈ హోటల్‌ను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన గెలాక్సీ ప్రాపర్టీస్ కొనుగోలు చేసి కొత్త ప్రదేశానికి మార్చాలని ప్లాన్ చేసింది. దీని బాధ్యతను ఎస్.రష్టన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించారు. ఈ సంస్థ భవనాలను ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మార్చడంలో నిపుణమైంది. అయితే 220 టన్నుల హోటల్‌ను మార్చడం అంత సులువు కాదు. ఇది చాలా సవాలు అని ఎస్.రష్టన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పేర్కొంది.
కెనడాలోని ఒక పురాతన హోటల్ ను 700 సబ్బు బిళ్లల్ని ఉపయోగించి 300 మీటర్ల మేర తరలించారు.
రోలర్లు ఉపయోగించకుండా మొదటిసారి ఇలా భవనాన్ని తరలించారు. pic.twitter.com/9otcSAR8gd— Tony (@tonybekkal) December 12, 2023
ఎస్.రష్టన్ కంపెనీ యజమాని షెల్డన్ రష్టన్ దీనిపై ఓ కొత్త ఆలోచన చేశారు. షెల్డన్ భవనాన్ని మార్చడానికి సాంప్రదాయ రోలర్‌లను ఉపయోగించకుండా సబ్బులను ఉపయోగించారు. దీనిపై భవనం మరింత సులభంగా మారిందని ఆయన చెప్పారు. షెల్డన్ ఈ పనిలో 700 కంటే ఎక్కువ సబ్బును ఉపయోగించారు. భవనం 30 అడుగుల మేర దూరానికి మార్చారు. అయితే అక్కడ కూడా ఉంచకుండా త్వరలో కొత్త ప్రదేశానికి మార్చనున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: శ్రుతి హాసన్‌తో అడివి శేష్ లవ్‌స్టోరీ.. అడివి శేష్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..