SeshEXShruti : శ్రుతి హాసన్‌తో అడివి శేష్ లవ్‌స్టోరీ.. అడివి శేష్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

తాజాగా నేడు మరో కొత్త సినిమాని ప్రకటించాడు అడివి శేష్. SeshEXShruti అంటూ శ్రుతి హాసన్(Shruti Haasan) తో ఓ లవ్ స్టోరీ సినిమా ఉండబోతుందని అడివిశేష్ ప్రకటించాడు.

SeshEXShruti : శ్రుతి హాసన్‌తో అడివి శేష్ లవ్‌స్టోరీ.. అడివి శేష్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడుగా..

Adivi Sesh Announced New Movie with Shruti Haasan

Updated On : December 12, 2023 / 1:26 PM IST

SeshEXShruti : తక్కువ బడ్జెట్ లో మంచి మంచి సినిమాలు తీసి హిట్ కొట్టడంలో అడివి శేష్(Adivi Sesh) దిట్ట. ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు తీస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు అడివి శేష్. ఇటీవల మేజర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఆ తర్వాత హిట్ 2 సినిమాతో మరో హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న అడివి శేష్ గూఢచారి 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు.

తాజాగా నేడు మరో కొత్త సినిమాని ప్రకటించాడు అడివి శేష్. SeshEXShruti అంటూ శ్రుతి హాసన్(Shruti Haasan) తో ఓ లవ్ స్టోరీ సినిమా ఉండబోతుందని అడివిశేష్ ప్రకటించాడు. ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తుంది. ప్రముఖ యువ కెమరామెన్ షానిల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు.

Also Read : Harish Shankar : మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్.. షూట్ నుంచి ఫోటో లీక్ చేసిన డైరెక్టర్..

ఇన్నాళ్లు ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో మెప్పించిన అడివి శేష్ ఈ సారి పూర్తి స్థాయి లవ్ జోనర్ తో రాబోతున్నాడని తెలుస్తుంది. శ్రుతి హాసన్ ని ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవడం విశేషం. మరి ఈ సినిమాతో ప్రేక్షకులని ఎలా మెప్పిస్తాడో చూడాలి. త్వరలో ఈ సినిమా గురించి మిగిలిన డీటెయిల్స్ రానున్నాయి. ఇటీవలే శ్రుతి హాసన్ తో కలిసి ఓ ఈవెంట్ లో పాల్గొన్న అడివి శేష్ ఫోటోలు కూడా షేర్ చేశాడు.