Harish Shankar : మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్.. షూట్ నుంచి ఫోటో లీక్ చేసిన డైరెక్టర్..

తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) నటించారు.

Harish Shankar : మరోసారి హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్.. షూట్ నుంచి ఫోటో లీక్ చేసిన డైరెక్టర్..

Harish Shankar Directed Allu Arjun Shoot Pic Leaked

Updated On : December 12, 2023 / 1:02 PM IST

Harish Shankar : హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) డేట్స్ ఇస్తే ఆపేసిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మొదలుపెడదామని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటంతో షూటింగ్స్ కూడా వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే హరీష్ శంకర్ మాత్రం ఇంకో సినిమా జోలికి వెళ్లకుండా పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్(Allu Arjun) నటించారు. అయితే ఇది సినిమా కాదు ఓ యాడ్ షూట్. మన స్టార్ డైరెక్టర్స్ స్టార్ హీరోలతో యాడ్స్ కూడా చేస్తారని తెలిసిందే. అల్లు అర్జున్ ఇప్పటికే అనేక యాడ్స్ తో వచ్చారు. త్వరలో మరో యాడ్ తో రాబోతున్నారు. ఈ యాడ్ కి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. నిన్న హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన యాడ్ షూట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది.

Harish Shankar Directed Allu Arjun Shoot Pic Leaked

Also Read : Shahrukh Khan : వరుసగా మూడోసారి.. సినిమా రిలీజ్‌కి ముందు వైష్ణోదేవి ఆలయానికి షారుఖ్.. సినిమా హిట్ కోసమే..?

ఈ షూట్ లో డైరెక్టర్ చైర్ లో హరీష్ శంకర్ కూర్చున్న ఫోటోని తనే షేర్ చేసి ఇంట్రెస్టింగ్ న్యూస్ రాబోతుందని పోస్ట్ చేశారు. అయితే ఇది ఏ ప్రోడక్ట్ కి సంబంధించిన యాడ్ అనేది ఇంకా సమాచారం లేదు. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ DJ (దువ్వాడ జగన్నాధం) సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి విజయం సాధించింది. బన్నీ కొత్త యాడ్ లో నటిస్తున్నాడు అని తెలియడంతో అది ఏం యాడ్, ఆ యాడ్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక బన్నీ మరోవైపు పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.