Become CM by lost Elections: ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థి సీఎం ఎలా అవుతారు? రాజ్యాంగంలోని ఈ విషయం ఏం చెప్తుందంటే?

2017లో ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మెజారిటీతో గెలిచింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు

Become CM by lost Elections: ఎమ్మెల్యేగా ఓడిపోయిన అభ్యర్థి సీఎం ఎలా అవుతారు? రాజ్యాంగంలోని ఈ విషయం ఏం చెప్తుందంటే?

Updated On : December 12, 2023 / 3:38 PM IST

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల అనంతరం నాలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పేర్లు ఫైనల్ అయ్యాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‭గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫైనల్ అయ్యారు. అయితే రాజస్థాన్‌లో ముఖ్యమంత్రి పదవికి బీజేపీ ఇప్పటికీ ప్రకటించలేదు. దీంతో దేశం మొత్తం చూపు రాజస్థాన్‌పైనే ఉంది. దేశంలో ముఖ్యమంత్రి పదవిపై నిరంతర చర్చ నడుస్తుండగా, ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్యేను ముఖ్యమంత్రిని చేయవచ్చనే ప్రశ్న సోషల్ మీడియాలో తెరపైకి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయినా లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఒక వ్యక్తిని ఎలా ముఖ్యమంత్రిని చేయగలరో తెలుసుకుందాం.

ఓడిపోయిన అభ్యర్థిని ముఖ్యమంత్రి ఎలా అవుతారు?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) ప్రకారం.. పార్టీ ప్రతిపాదించిన మెజారిటీ లేదా ఏ పార్టీకి మెజారిటీ రాకపోతే, ఆ రాష్ట్ర గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి, ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తితోనైనా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. ఇదే కాకుండా, గవర్నర్ తన అధికారాలను ఉపయోగించి ఎవరైనా సామాన్యుడిని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయవచ్చు. కానీ దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఒక వ్యక్తిని 6 నెలల వరకు ముఖ్యమంత్రిగా చేయవచ్చు. అంటే సదరు వ్యక్తి ముఖ్యమంత్రి అయిన 6 నెలలోపు శాసనసభకు ఎంపిక కావాలి. మండలి ఉన్న రాష్ట్రాల్లో మండిలికి ఎంపిక అయినా పరవాలేదు.

ఇది కూడా చదవండి: అలా చేయడం కంటే చచ్చిపోతాను.. సీఎం కుర్చీ జారీపోయిన అనంతరం మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

ఎందరో ముఖ్యమంత్రులయ్యారు
ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండానే చాలా మంది నాయకులు ముఖ్యమంత్రులు అయ్యారు. అందులో ఒకరు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. 2017లో ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ మెజారిటీతో గెలిచింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవికి యోగి ఆదిత్యనాథ్ పేరు తెరపైకి వచ్చింది. ఆ సమయంలో యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. యోగి ఆదిత్యనాథ్ ఏ శాసనసభ స్థానం నుంచి ఉప ఎన్నికలో పోటీ చేయకుండా శాసన మండలి సభ్యుడిగా మారారు. సీఎంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయని ఆయన మంత్రులు కూడా నలుగురు ఉన్నారు.

ఇక ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు. అలా అయిన వారిలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఒకరు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఘటిమా స్థానం నుంచి ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా బీజేపీ ఆయనను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత, పుష్కర్ సింగ్ ధామి 6 నెలల్లోపే చంపావత్ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికలో పోటీ చేసి భారీ ఓట్లతో విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాహుల్ గాంధీ