Rahul Gandhi: నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాహుల్ గాంధీ

అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అమిత్ షాకు చరిత్ర తెలియదని అన్నారు. పండింట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశం కోసం ..

Rahul Gandhi: నెహ్రూపై అమిత్ షా వ్యాఖ్యలు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రాహుల్ గాంధీ

Rahul Gandhi

Updated On : December 12, 2023 / 2:13 PM IST

Congress MP Rahul Gandhi : జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370పై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశ తొలి ప్రధాని పండింట్ జవహర్ లాల్ నెహ్రూపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ లేకపోతే ఈరోజు పీవోకే ఉండేది కాదని అమిత్ షా అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. అమిత్ షాకు చరిత్ర తెలియదని అన్నారు. పండింట్ జవహర్ లాల్ నెహ్రూ భారతదేశం కోసం తన జీవితాన్ని అర్పించారు. సంవత్సరాలు జైలులో ఉన్నారు. హోంమంత్రి అమిత్ షాకు చరిత్ర తెలియదు. ఆయన చరిత్ర తెలుస్తుందని ఊహించలేము.. దానిని తిరగరాసే అలవాటు ఉందని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : IPS Officers Transfers Telangana : తెలంగాణలో పలువురు ఐపీఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ సీపీగా శ్రీనివాస్ రెడ్డి

ప్రాథమిక సమస్య కుల గణన. దీని గురించి వాళ్లు మాట్లాడరు. దేశ సంపద ఎవరి చేతుల్లోకి వెళ్తుందో ఈ వ్యక్తులు ఈ అంశంపై చర్చించడానికి ఇష్టపడరు. వారు భయపడిపోతారు. మేము ఈ సమస్యను ముందుకు తీసుకెళ్తాం. పేద ప్రజలక వారి హక్కులను అందిస్తామని రాహుల్ అన్నారు. మధ్యప్రదేశ్ లో ఓబీసీని ముఖ్యమంత్రిని చేయడంపై రాహుల్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీకూడా ఓబీసీయేనని, అయితే, పరిపాలనలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారనేదే ప్రశ్న అంటూ రాహుల్ అన్నారు. ఓబీసీల భాగస్వామ్యం ఏమిటో మాకు చెప్పండి అంటూ రాహుల్ ప్రశ్నించారు.