Shivraj singh Chouhan Farewell Message: అలా చేయడం కంటే చచ్చిపోతాను.. సీఎం కుర్చీ జారీపోయిన అనంతరం మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు
మధ్యప్రదేశ్‌లో కొత్త సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే కొంతమంది మహిళలు శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిసేందుకు వచ్చి బోరున విలపించడం గమనార్హం. మహిళల రోదనను చూసి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 18 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలో కొత్త ముఖ్యమంత్రి పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించింది. మోహన్ యాదవ్‌ను నూతన ప్రభుత్వ సారథిని చేశారు. అయితే తన నుంచి ముఖ్యమంత్రి పీఠం జారిపోవడంపై శివరాజ్ సింగ్ చౌహాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఢిల్లీకి వెళ్లి అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. అడుకకోవడం కంటే చనిపోతాను’’ అని శివరాజ్ అన్నారు. అదే సమయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా తాను మధ్యప్రదేశ్‌లోనే ఉన్నానని, ఇక్కడే ఉంటానని అన్నారు. ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారనే గుసగుసల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేర్లను ప్రకటించిన నేపథ్యంలో మూడు రాష్ట్రాల సీనియర్ మంత్రులు హైకమాండ్‌ను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్నారు. అయితే శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కూడా ఈ విషయమై ఢిల్లీ వెళ్తున్నారా అనే చర్చ కొనసాగుతోంది. దీనిపై ఆయనను ప్రశ్నించగా.. ‘‘నేను ఎవరినీ ఏమీ అడుక్కోను. అలా అడుక్కోవడం కంటే చనిపోవటానికే ఇష్టపడతాను’’ అని అన్నారు. ఇక అదే సమయంలో తనను పార్టీ 18 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసిందని బీజేపీ నాయకత్వానికి అనుకూలంగా మాట్లాడారు. ‘‘బీజేపీ నాకు అన్నీ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పార్టీకి తిరిగి ఇవ్వాల్సిన సమయం వచ్చింది’’ అని అన్నారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాడ్లీ బ్రాహ్మణ యోజన తర్వాత ఇప్పుడు లఖపతి బ్రాహ్మణ యోజనలో పని చేయబోతున్నట్లు చెప్పారు. ఇందుకోసం తన పూర్తి శక్తిని వినియోగించనున్నట్లు వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో కొత్త సీఎం ప్రకటన వెలువడిన మరుసటి రోజే కొంతమంది మహిళలు శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిసేందుకు వచ్చి బోరున విలపించడం గమనార్హం. మహిళల రోదనను చూసి సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం తర్వాత తాను సీఎం రేసులో లేనని స్వయంగా శివరాజ్ సింగ్ ప్రకటించారు.