French daredevil Remi Lucidi : సాహసం కోసం వీడియోలు తీస్తు 68అంతస్థు నుంచి పడి 30 ఏళ్ల యువకుడి మృతి
సాహాసాలు చేస్తు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన 30 ఏళ్ల యువకుడి సాహసం చేస్తునే ప్రాణాలు కోల్పోయాడు. ఏ సాహాసాలు అయితే అతనికి పేరు తెచ్చిపెట్టారు. అదే సాహసం ప్రాణాలు తీసింది.

French daredevil Remi Lucidi Ends His Life
French daredevil Remi Lucidi Ends His Life : సాహసం చేయటం అంటే ప్రాణాలను పణంగా పెట్టటమే. సక్సెస్ అయితే ఫేమస్..లేకుంటా పైకే అనేలా ఉంటాయి సాహసీకుల జీవితాలు. అదే జరిగింది ఓ 30 ఏళ్ల యువకుడికి. చూస్తేనే ఒళ్లు జలదరించే సాహసాలు చేస్తు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన 30 ఏళ్ల యుకువడు ఓ సాహసం చేస్తు ప్రాణాలు కోల్పోయాడు. అతని పేరు రెమీ లూసిడి(Remi Lucidi). ఫ్రెంచ్ డేర్‌డెవిల్(French daredevil)గా పేరొందాడు. అతను చేసే సాహసాలు మామూలుగా ఉండవు. సాహసాలు చేయటానికి దేశ దేశాలు తిరుగుతుంటారు. సాహసాలు చేయటం వారికి ఎంతో థ్రిల్ ని ఇస్తుంది. అలాగే మంచి పేరుతో పాటు డబ్బులు కూడా తెచ్చిపెడుతుంది.
రెమీ లూసిడికి సాహసం చేయటం అంటే మహా సరదా. దాని కోసం ప్రాణాల్ని పణంగా పెడుతుంటారు. ప్రతీ సాహసం కత్తిమీద సాములాగానే ఉంటుంది. కానీ ఆ సాహసాలు చేసే హామీనే అతని ప్రాణాలు తీసింది. ఫ్రెంచ్ డేర్‌డెవిల్(French daredevil)గా ప్రసిద్ధి చెందిన హాంకాంగ్ (Hong Kong)లో 68 అంతస్తుల భవనంపై సాహసం చేస్తు రెమీ లూసిడి కిందపడి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.
హాంకాంగ్‌లోని ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ (Tregunter Tower complex)అనే పెద్ద భవనాన్ని ఎక్కాలని లూసిడి ఫిక్స్ అయ్యాడు. ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే అది చేసి తీరాలనే పట్టుదల అతని సొంతం. కానీ దురదృష్టవశాత్తు అదే అతని ప్రాణాలు తీసింది. ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ వద్దకు వచ్చి రెమీ అందులోకి వెళ్లేందుకు అబద్దాలు కూడా ఆడాడు. ఆ కాంప్లెక్స్ లోకి వెళ్లటానికి 40వ అంతస్తులో తన ఫ్రెండ్ ఉంటాడని అతనికి కలవటానికి తాను వచ్చానని సెక్యూరిటీకి అబద్ధం చెప్పాడు. అయినా సెక్యురిటీ లోపలికి ప్రవేశించటానికి వీల్లేదని చెప్పాడు. కానీ సెక్యురిటీ సిబ్బందికి టోకరా ఇచ్చి ఎలాగైతేనే లోపలికి ప్రవేశించాడు.
సాయంత్రం సమయంలో ది ట్రెగంటెర్ టవర్ కాంప్లెక్స్ (Tregunter Tower complex)లోపలికి వెళ్లిన లూసిడి లిఫ్ట్ ఎక్కి 49 వ అంతస్థు వరకు వెళ్లాడు. అక్కడ లిఫ్ట్ దిగిపోయి మెట్ల నుంచి పైకి ఎక్కినట్లుగా సీసీటీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. భవనంపై అంతస్థుకు వెళ్లిన అతను అక్కడి నుంచే ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నాడు. అలా తను వచ్చిన పని బాగానే అవుతోందని అనుకున్నాడు. కానీ ఊహించనది జరిగిపోయింది. భవనం అంచుకు చేరే క్రమంలో కాలు స్లిప్ అయ్యింది. పట్టుకోల్పోయాడు. కాలు జారి కింద పడిపోయాడు. అలా జారిపోయిన లూసిడి 68 వ అంతస్థులోని ఓ ప్లాట్ విండోకి చిక్కుకున్నాడు. అక్కడ వేలాడుతుండగా ఆ ప్లాట్ లో పనిచేసి పనిమనిషి చూసి ఆశ్చర్యపోయింది. కంగారుపడి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. అంతలోనే లూసిడి అక్కడి నుంచి కూడా జారిపోయాడు. కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. రాత్రి 7.38 వరకు కిటీకికి చిక్కుకుని ప్రాణాలతోనే ఉన్న అతను ఆ తరువాత అక్కడి నుంచి కింద 700ల అడుగుల కిందకు పడి మరణించాడు.
పనిమనిషి ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే ఆ కాంప్లెక్స్ వద్దకు చేరే సమయానికే లూసిడి పడిపోవటం చనిపోవటం జరిగిపోయింది. ఘటనా స్థలంలో లూసిడి
ఉపయోగించిన కెమెరాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలా సాహసాలు చేస్తు ఫేమస్ అయిన అతను అదే సాహసం చేస్తు ప్రాణాలు కోల్పోయాడు.