Bangladesh Ferry Fire : బంగ్లాదేశ్‌లో బోటుకు ప్రమాదం.. 32మంది మృతి, 100 మందికి గాయాలు

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం జరిగింది. సౌతరన్ బంగ్లాదేశ్‌లో ఫెర్రీ బోటులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫెర్రీలో ప్రయాణిస్తున్న 32మంది దుర్మరణం చెందారు.

Bangladesh Ferry Fire : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘోర ప్రమాదం జరిగింది. సౌతరన్ బంగ్లాదేశ్‌లో ఫెర్రీ బోటులో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఫెర్రీలో ప్రయాణిస్తున్న 32మంది దుర్మరణం చెందారు. మరో 100మందికి తీవ్రగాయాలయ్యాయని బంగ్లా పోలీసులు వెల్లడించారు. ప్రమాదం సమయంలో ఫెర్రీ పడవలో 500 మంది ప్రయాణిస్తున్నారు. ఇప్పటివరకూ 32 మృతదేహాలను గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. నదిలో ప్రయాణిస్తున్న సమయంలో ఫెర్రీ బోట్ ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల్లో చిక్కుకుని కొంతమంది మరణించగా..  మరికొంతమంది నదిలో దూకేసి ప్రాణాలు కోల్పోయారని లోకల్ పోలీసు చీఫ్ మెయినల్ ఇస్లాం తెలిపారు. రాజధాని ఢాకాకు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝక్కాథి రూరల్ టౌన్ సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

గతంలోనూ నదుల దాటే క్రమంలో చాలా బోటులు ప్రమాదాలకు గురికాగా..  తాజాగా ఫెర్రీ బోటు అగ్నిప్రమాదానికి గురైంది. 170 మిలియన్ల జనాభా గల బంగ్లాదేశ్‌లో నౌకలు, పడవల రవాణా నిర్వహణ చాలా చెత్తగా ఉందని నిపుణులు విమర్శిస్తున్నారు. షిప్ యార్డుల్లో భద్రతపరమైన ప్రమాణాలను పాటించకుండా బోటు సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కిస్తున్నారని, అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు.

గత జూలైలో, ఢాకా పారిశ్రామిక నగరమైన రూపగంజ్‌లోని ఆహార, పానీయాల ఫ్యాక్టరీలో జరిగిన మంటల్లో 52 మంది దుర్మరణం చెందారు. ఫిబ్రవరి 2019లో రసాయనాలను అక్రమంగా నిల్వ ఉంచిన ఢాకా అపార్ట్‌మెంట్లలో మంటలు చెలరేగడంతో కనీసం 70 మంది మరణించారు. ఆగస్ట్‌లో తూర్పు బంగ్లాదేశ్‌లోని సరస్సులో ప్రయాణికులతో నిండిన పడవ, ఇసుకతో నిండిన కార్గో షిప్ ఢీకొనడంతో కనీసం 21 మంది మరణించారు. బిజోయ్‌నగర్ పట్టణానికి సమీపంలో కార్గో షిప్ స్టీల్ బోటు, ఎదురుగా వచ్చే ఓడను ఢీకొన్నప్పుడు పడవలో 60 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.

కార్గో షిప్ స్టీల్ టిప్ పడవ ఢీకొనడంతో ప్రయాణీకుల ఓడ బోల్తా పడింది. ఏప్రిల్, మే నెలల్లో రెండు వేర్వేరు ప్రమాదాల్లో 54 మంది చనిపోయారు. గత ఏడాది జూన్‌లో, ఢాకాలో ఒక ఫెర్రీని వెనుక నుండి మరొక ఫెర్రీ ఢీకొనడంతో కనీసం 32 మంది మరణించారు. ఫిబ్రవరి 2015లో ప్రయాణికులతో వెళ్లే ఓడ.. ఎదురుగా వచ్చే కార్గో నౌకను ఢీకొనడంతో కనీసం 78 మంది మరణించారు.

Read Also : Omicron Wave : దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ తగ్గుముఖం ?

ట్రెండింగ్ వార్తలు