Sudan Fighting: కాల్పుల విరమణ ఒప్పందంపై నిలబడని ఆర్మీ, పారామిలిటరీ.. ఇప్పటి వరకు 400 మంది మృతి, 3,500 మందికి గాయాలు

2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో సూడాన్‭లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్ఎస్ఎఫ్‭తో ఆర్మీకి విభేదాలు తలెత్తాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సులను సైన్యంలో విలీనం చేసేందుకు సూడాన్ ఆర్మీ రూపొందించిన ప్రతిపాదన ఆర్మీ-పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణకు దారి తీసిం

Sudan Fighting: సూడాన్‭లో ఆర్మీకి, పారామిలటరీ దళానికి మధ్య చెలరేగిన ఘర్షణలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్నాయి. ఈ రెండు గ్రూపుల మధ్య కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఆ దేశంలో ఇప్పటి వరకు సుమారు 413 మంది చనిపోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతే కాకుండా 3,551 మంది వరకు గాయపడ్డారట. ఇందులో చిన్నారులు అధిక సంఖ్యలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి బాలల ఏజెన్సీ ఆవేదన వ్యక్తం చేసింది. తొమ్మిది మంది చిన్నారులను ఈ ఘర్షణ పొట్టన పెట్టుకుందని, 50 మంది తీవ్రంగా గాయపడ్డట్లు టర్కిష్ ఏజెన్సీ పేర్కొంది.

Amit shah: ఢిల్లీలో మోదీకి వినపడేలా తెలంగాణ ప్రజలు ఈ విషయం చెప్పండి: అమిత్ షా

కాగా, సూడాన్‭లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు రెండు సీ-130 విమానాలు, ఒక నావెల్ షిప్పును ఏర్పాటు చేసినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. భారతీయుల్ని క్షేమంగా అక్కడి నుంచి తరలించే ప్రక్రియ కొనసాగుతోందని ఎంఈఏ తెలిపింది. ‘‘దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేశాము. వీలైనంత తొందరగా, క్షేమంగా భారతీయుల్ని తరలిస్తున్నాం. వివిధ మార్గాల ద్వారా భారతీయుల్ని తరలించే ప్రయత్నం జరుగుతోంది. రెండు సీ-130 విమానాలను జెడ్డాలో ఏర్పాటు చేశాం. ఇక ఒక నావెల్ షిప్పు (ఐఎన్ఎస్ సుమేధా) సూడాన్ పోర్టుకు ఇప్పటికే చేరుకుంది’’ అని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Kuno National Park : కునో నేషనల్ పార్కులో మరో చిరుత మృతి .. నెల రోజుల వ్యవధిలో రెండోది

2021 అక్టోబరులో సైనిక తిరుగుబాటుతో సూడాన్‭లో ప్రజాస్వామ్యం కుప్పకూలింది. ఆ తర్వాత పారామిలిటరీ గ్రూపు ఆర్ఎస్ఎఫ్‭తో ఆర్మీకి విభేదాలు తలెత్తాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సులను సైన్యంలో విలీనం చేసేందుకు సూడాన్ ఆర్మీ రూపొందించిన ప్రతిపాదన ఆర్మీ-పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఇవి తారా స్థాయికి చేరడంతో దాడులు ప్రారంభమయ్యాయి. హింసాత్మక ఘటనల మధ్య పౌరుల సురక్షిత తరలింపు కోసం ప్రస్తుతం ఇరువర్గాలు 24 గంటల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయితే దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేదనే అంటున్నారు. ఈ ఒప్పందం జరిగినప్పటికీ.. ఇరు వర్గాల నుంచి కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయట.

ట్రెండింగ్ వార్తలు