Kuno National Park : కునో నేషనల్ పార్కులో మరో చిరుత మృతి .. నెల రోజుల వ్యవధిలో రెండోది

కునో నేషనల్ పార్కులో నెల రోజుల వ్యవధిలో రెండు చిరుతలు మరణించాయి.

Kuno National Park : కునో నేషనల్ పార్కులో మరో చిరుత మృతి .. నెల రోజుల వ్యవధిలో రెండోది

Kuno National Park

Kuno National Park : మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలోని కునో నేషనల్ పార్కు (Kuno National Park) లో దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన మగ చిరుత మృతి (Male cheetah died) చెందింది. ఉదయ్ అనే పేరుకలిగిన చిరుత అనారోగ్యంతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం మరణించింది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫార్జెస్ట్ జేఎస్ చౌహాన్ ధృవీకరించారు. ఆదివారం ఉదయం చిరుత అస్వస్థతకు గురికావడాన్ని గమనించిన అటవీశాఖ బృందం .. దానిని వెంటనే వైద్య కేంద్రానికి తీసుకెళ్లి చికిత్స నిర్వహించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఉదయ్ అనే చిరుత ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మరణించినట్లు అధికారులు తెలిపారు.

Kuno National Park: కునో పార్కులో నమీబియా చిరుత మృతి.. మిగిలిన వాటి పరిస్థితి ఎలా ఉదంటే?

కునో నేషనల్ పార్కులో  నెల రోజుల వ్యవధిలో మరణించిన చిరుతల్లో ఇది రెండోది. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి మొత్తం 20 చిరుతలు కునో నేషనల్ పార్కుకు రాగా.. వాటిలో ఆడ చిరుత (సాషా), మగ చిరుత (ఉదయ్) మరణించాయి. పార్కులో మరో 18 చిరుతలు ఉన్నాయి. చిరుతకు సోమవారం పోస్టుమార్టం నిర్వహిస్తారు. ఈ పోస్టుమార్టంను వీడియో చిత్రీకరణ చేస్తారు. తరువాత మృతికి కారణాలను వెల్లడిస్తామని అటవీశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

Kuno national park Cheetahs: గర్భం దాల్చిన చీతా..

దేశంలో చిరుతల సంఖ్యను పెంచే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రాజెక్టును చేపట్టింది. ప్రపంచంలో మొట్టమొదటి ఇంటర్‌కాంటినెంటల్ ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్‌లో భాగంగా 20 చిరుతలను దేశానికి తీసుకొచ్చారు. తొలి విడతలో నమీబియా నుంచి ఎనిమిది చిరుతలు భారతదేశంకు ప్రత్యేక విమానంలో చేరుకున్నాయి. వాటిని మధ్యప్రదేశ్ రాష్ట్రం కునో నేషనల్ పార్కులోని ఎన్‌క్లోజర్‌లోకి ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా వదిలారు. రెండో దఫా దక్షిణాఫ్రికా నుంచి పన్నెండు చిరుతలు వచ్చాయి. వాటిలో ఐదు ఆడ చిరుతలు ఉన్నాయి. మొత్తం 20 చిరుతలు కునో నేషనల్ పార్కు‌కు‌రాగా వాటికి పేర్లుసైతం పెట్టారు.

Cheetahs in kuno national park: చీతా… క్షేమమే..!

గతనెలలో నమీబియా నుంచి తీసుకొచ్చిన సాషా అనే చిరుత అనారోగ్యంతో మరణించింది. కిడ్నీలో ఇన్‌ఫెక్షన్ కారణంగా అది మరణించినట్లు కునో నేషనల్ పార్కు అధికారులు తెలిపారు. మొదటి విడతలో నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆడ చిరుతల్లో ఒకటి సాషా. నెల రోజుల వ్యవధిలోనే రెండు చిరుతలు మరణించడం చర్చనీయాంశంగా మారింది. నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి తీసుకొచ్చిన చిరుతలు ఇక్కడ వాతావరణానికి అలవాటు పడకనే అనారోగ్యానికి గురవుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. అయితే కునో పార్కు అధికారులు మాత్రం వాటికి ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.