46 People Died
San Antonio: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. నైరుతి శాన్ ఆంటోనియోలోని రిమోట్ బ్యాక్ రోడ్‌లో అనుమానిత వలసదారులతో కూడిన ట్రక్కులో 46 మృతదేహాలు లభ్యమయ్యాయి. ట్రక్కు నుంచి అరుపులు వినిపించడంతో పోలీసులు ట్రక్కు డోర్లు తెరిచి చూడగా.. అందులో 46 మృతదేహాలు గుర్తించారు. మరో 16 మంది ప్రాణాప్రాయ స్థితిలో ఉండటంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
https://twitter.com/ABishopGustavo/status/1541590589933867010?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1541590589933867010%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.nytimes.com%2Flive%2F2022%2F06%2F27%2Fus%2Fmigrants-san-antonio-tractor-killed
చికిత్స పొందుతున్న వారిలో 12మంది పెద్దలు, నలుగురు పిల్లలు ఉన్నట్లు ఫైర్ చీఫ్ చార్లెస్ హుడ్ తెలిపారు. వారు తీవ్రమైన వేడిలో ఉండటంతో డీహైడ్రేట్ అయ్యారని, శ్వాస తీసుకోవటంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారు మానవ అక్రమ రవాణాతో ఖచ్చితంగా సంబంధం కలిగి ఉన్నారా అనేది విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.
At least 42 people were found dead Monday in a big-rig truck in San Antonio, Texas Gov. Greg Abbott said. More people have been transported to area hospitals.
Updates: https://t.co/lfTU70A9B7 pic.twitter.com/L6oULaE7sB
— NBC DFW (@NBCDFW) June 28, 2022
ఇదిలాఉంటే.. మెక్సికో నుంచి అమెరికాకు అక్రమ వలసదారులు ఎక్కువ సంఖ్యలో ట్రక్కుల్లో వెళ్తుంటారు. మెక్సికన్ సరిహద్దు నుండి 160 మైళ్ళు (250 కిమీ) దూరంలో ఉన్న శాన్ ఆంటోనియోలో సోమవారం అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అధిక తేమతో 103 డిగ్రీల ఫారెన్‌హీట్ (39.4 డిగ్రీల సెల్సియస్) వరకు టెంపరేచర్ పెరిగింది. దీంతో వలసదారులు ట్రక్కులో మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంతకు ముందు కూడా వలసదారులతో వెళ్తున్న మెక్సికోకు చెందిన ట్రక్కులు ప్రమాదానికి గురి కావడంతో పదుల సంఖ్యలో మెక్సికన్లు మృతిచెందారు. ఈ ఘటనపై US హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ నేతృత్వంలో దర్యాప్తు జరుగుతోంది.